తెలంగాణ

‘జలవనరుల ప్రాజెక్టులతో అభివృద్ధి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 10: తెలంగాణలో జలవనరుల ప్రాజెక్టులతో రాష్ట్భ్రావృద్ధికి మార్గం మరింత సుగమం అవుతోందని గురువారం నాడిక్కడ ప్రారంభమైన జలవనరుల అంతర్జాతీయ సదస్సులో పరిశోధకులు, విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సదస్సులో పలువురు పరిశోధనా పత్రాలను సమర్పించారు. సదస్సులో ఐఐటిల నుండి ఇతర జాతీయ సంస్థల నుండి మేథావులు హాజరై ఇటీవలి కాలంలో సివిల్ ఇంజనీరింగ్ రంగంలో సాధించిన ప్రగతి, జరుగుతున్న పరిణామాలు తదితర అంశాలపై పూర్తి స్థాయిలో చర్చించారు. ఈ సదస్సును సిసిఎంబి మాజీ సంచాలకుడు డాక్టర్ లాల్జీసింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకీ మానవ జీవన పరిస్థితుల మెరుగుకు సివిల్ ఇంజనీరింగ్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ విశేష కృషి సల్పుతోందని అన్నారు.
ఎన్నోకొత్త కొత్త సాంకేతిక విప్లవ పరిస్థితులను ఎదుర్కొంటోందని, అలాగే పర్యావరణ ఇబ్బందులను సైతం ఎదుర్కొంటోందని అంటూ సివిల్ ఇంజనీర్లు ఎప్పటికపుడు మారుతున్న పరిస్థితులను అర్ధం చేసుకుంటూ సృజనాత్మకతతో ముందడుగు వేయాలని అన్నారు. వాటర్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్, ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్ ఇంజనీరింగ్, హైడ్రాలిక్ స్ట్రక్చర్సు, హైడ్రోపవర్ ఇంజనీరింగ్ తదితర రంగాలకు సంబంధించిన అంశాలతో పాటు వాటర్ రిసోర్సెస్ ప్లానింగ్, జియోటెక్నికల్ ఇంజనీరింగ్ క్లైమేట్ చేంజ్ , గ్లోబల్ వార్మింగ్ తదితర రంగాలకు సంబంధించిన అంశాలపైనా సదస్సులో చర్చిస్తున్నట్టు హిట్స్ సంస్థ చైర్మన్ డాక్టర్ అరిమండ వరప్రసాదరెడ్డి చెప్పారు.