తెలంగాణ

బియ్యం సేకరణ లక్ష్యాన్ని చేరాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 10: రాష్ట్రంలో బియ్యం సేకరణలో నిర్ణీత గడువులోగా లక్ష్యాన్ని చేరుకోవాలని తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్ సివి ఆనంద్ అన్నారు. ఇప్పటికే మిల్లర్లు 54 శాతం బియ్యాన్ని అప్పగించారని, మిగిలిన 46 శాతం కూడా ఈ నెల 31 నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం నాడిక్కడ కమిషనర్ ఆనంద్ జిల్లాల జాయింట్ కలెక్టర్లు, డిసిఎస్‌ఓలు, జిల్లా మేనేజర్లు, ఎఫ్‌సిఐ, రైస్‌మిల్లర్లు, ఎన్‌ఐసి అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. మిల్లర్ల నుంచి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సిఎంఆర్)ను సేకరించాలని, ఈ-పాస్ విధానం, దీపం తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించారు. గత ఖరీఫ్‌లో జగిత్యాలలో ఒక రైస్‌మిల్లు మినహా 99.94 శాతం బియ్యాన్ని మిల్లర్లు ప్రభుత్వానికి గడువులోగా అప్పగించారని, ఈ రబీలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగించాలని అన్నారు. బియ్యం నిల్వలకు అవసరమైన స్థలాన్ని ఎఫ్‌సిఐ అధికారులు అందుబాటులో ఉంచారని తెలిపారు. ఈ ఏడాది రబీలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన 37.16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇచ్చేందుకు మిల్లుల సామర్థ్యానికి అనుగుణంగా మిల్లర్లకు అప్పగించామని తెలిపారు.
ఇందుకు గాను 25.27 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుందని, ఈ నెల 9 నాటికి 13.67 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మిల్లర్లు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ)కి అప్పగించారని తెలిపారు. అయితే ఇది ఏమాత్రం సరిపోదని బియ్యం సేకరణలో వేగాన్ని పెంచాలని అన్నారు. మేడ్చల్, గద్వాల్, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నల్గొండ, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో బియ్యం సేకరణ ప్రక్రియ చాలా వేగంగా జరుగుతోందని, నిర్మల్, మంచిర్యాల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, పెద్దపల్లి, వనపర్తి జిల్లాలు సేకరణలో చాలా వెనుకబడి ఉన్నాయని కమిషనర్ స్పష్టం చేశారు.
కాగా ఈ-పాస్ విధానం అమల్లో జాయింట్ కలెక్టర్ల భాగస్వామ్యం పెరగాలని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో 1545 దుకాణాలతో పాటు రాష్టవ్య్రాప్తంగా ఇప్పటి వరకు 5,775 రేషన్ దుకాణాల్లో ఈ-పాస్ యంత్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. మిగిలిన రేషన్ దుకాణాల్లో కూడా దశలవారీగా ఈ-పాస్ యంత్రాలను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. రేషన్ సరుకుల సమాచారాన్ని లబ్ధిదారులకు ఎస్‌ఎంఎస్ రూపంలో అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బియ్యం అప్పగించే గడువును మరో నెల రోజుల పాటు పెంచాలన్న మిల్లర్ల విన్నపాన్ని తిరస్కరిస్తూ ఒకటి, రెండు వారాలు సమయం పొడిగించే అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేశారు.