తెలంగాణ

విదేశీయుల ఇళ్లలో తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 10: నగరంలోని విదేశీయుల నివాసాల్లో టాస్క్ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వీసా గడువు కాలం ముగిసినప్పటికీ ఇక్కడే ఉంటున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ ప్రాంతాల్లో నివాసముంటోన్న విదేశీయుల ఇళ్ళలో సోదాలు నిర్వహించారు. వెస్ట్‌జోన్ టాస్క్ఫోర్స్ డిసిపి లింబారెడ్డి ఆధ్వర్యంలో బంజారాహిల్స్ పోలీసుల ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. దాదాపు 30 మంది విదేశీయులను అదుపులోకి తీసుకుని గోషామహల్, మల్లేపల్లి పోలీస్ స్టేషన్లకు తరలించారు. వీరిలో నైజీరియన్లు, బంగ్లాదేశీయులే ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. కాగా వీరి వీసా గడువు, చేస్తున్న ఉద్యోగం, చదువుకునేందుకు వచ్చినట్టైతే..వారి పూర్తి వివరాలు వంటి వాటిపై దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. వీసా గడువు ముగిసినా నగరంలోనే ఉంటున్న వారిని గుర్తించి వారివారి దేశాలకు తిరిగి పంపిస్తామని డిసిపి లింబారెడ్డి తెలిపారు.