ఆంధ్రప్రదేశ్‌

షార్‌ను సందర్శించిన నాసా చీఫ్ చార్లెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, ఏఫ్రిల్ 6: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్ ) ను బుధవారం నాసా చీఫ్ (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) ఛార్లెస్ ఎఫ్ బొల్డాన్ సందర్శించారు. చెన్నై నుంచి రోడ్డు మార్గాన ఆయన షార్‌కు చేరుకొన్న ఆయనకు మొదటి గేటు వద్ద షార్ డైరెక్టర్ కున్హికృష్ణన్‌తో పాటు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం షార్ అధికారుల బృందంతో కలసి ప్రయోగ వేదికతోపాటు ముఖ్య విభాగాలను సందర్శించారు. మధ్యాహ్నం 2 గంటలకు శ్రీహరికోటలోని బ్రహ్మప్రకాష్ హాలులో ఉద్యోగుల ఉపన్యాస కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఉద్యోగులను ఉద్దేశించి అరగంటపాటు ఉపన్యసించారు. ఈ కార్యక్రమంలో షార్ కంట్రోలర్ జెవి రాజారెడ్డి, గ్రూపు డైరెక్టర్ విజయసారధి , ఉద్యోగులు పాల్గొన్నారు.

ఎఓబిలో పేలిన మందుపాతరలు

సిఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు అలజడి సృష్టించిన మావోలు

ముంచంగిపుట్టు, ఏప్రిల్ 6: రాష్ట్రంలో మావోలు మళ్లీ విరుచుకుపడ్డారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఎఒబి) విశాఖపట్నం జిల్లా ముంచంగిపుట్టు మండలం కరిముఖిపుట్టు పంచాయతీ దూలిపుట్టు గ్రామసమీపంలో బుధవారం శక్తివంతమైన ఐదు మందు పాతరలు పేల్చారు. ఈ సంఘటనలో ఓ సిఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. మన్యంలో కలకలం సృష్టించిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ప్రత్యక్షసాక్షులు, పోలీసుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. పెదబయలు మండలం రూడకోటలో పోలీస్ అవుట్ పోస్టు నిర్మాణం పనులను పర్యవేక్షించేందుకు సిఆర్‌పిఎఫ్ 198/ఇ బెటాలియన్‌కు చెందిన సిఆర్‌పిఎఫ్, స్పెషల్ పార్టీ పోలీసులు మంగళవారం సాయంత్రం వెళ్లారు. ముంచంగిపుట్టు నుంచి రూడకోట వెళ్లి బుధవారం ఉదయం ముంచంగిపుట్టు వైపు కాలినడకన తిరిగి వస్తుండగా మావోయిస్టులు అమర్చిన ఐదు మందుపాతరలు ఒక్కసారిగా పేలాయి. సిఆర్‌పిఎఫ్ పోలీసుల కదలికలను పసిగట్టిన మావోయిస్టులు దూలిపుట్టు గ్రామ సమీపంలో పది అడుగుల దూరంలో ఐదు మందుపాతరలను అమర్చి పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకోగానే ఒక్కసారిగా పేల్చారు. ఈ సంఘటనలో సిఆర్‌పిఎఫ్ 198/ఇ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ శ్రీనివాస్ సాహూ తీవ్రంగా గాయపడ్డాడు. మిగిలిన వారు చాకచక్యంగా తప్పించుకున్నారు. వెంటనే తేరుకున్న పోలీసులు పక్కనే కొండపై మాటువేసి ఉన్న మావోయిస్టులపైకి ఎదురుకాల్పులు జరిపారు.
ఈ సందర్భంగా మావోలు, పోలీసుల మధ్య కొద్దిసేపు ఎదురుకాల్పులు జరిగాయి. కొద్దిసేపటికి మావోయిస్టులు తప్పించుకుని కొండల్లోకి పారిపోయారు. రూడకోట గ్రామంలో పోలీస్ అవుట్‌పోస్టు నిర్మాణానికి నిరసనగా మావోయిస్టులు ఈ చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ సంఘటనతో మన్యం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మావోయిస్టులు మందుపాతర పేల్చిన విషయం తెలుసుకున్న నర్సీపట్నం ఓఎస్‌డి ఎ.బాబూజి బుధవారం మధ్యాహ్నం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మందుపాతరలు పేల్చేందుకు మావోలు వినియోగించిన వైర్లు, కిట్ బ్యాగులను పోలీసులు స్వాధీన పరచుకున్నారు.
ఈ సందర్భంగా ఓఎస్‌డి బాబుజి విలేఖరులతో మాట్లాడుతూ మందుపాతరలు పేలగానే పోలీసులు అప్రమత్తమై ఎదురు కాల్పులు జరిపారన్నారు. మావోలు తప్పించుకున్నట్లు ఆయన తెలిపారు. మావోయిస్టుల కోసం కూంబింగ్ విస్తృతం చేస్తామని ఆయన చెప్పారు. ఇదిలాఉండగా మందుపాతర సంఘటనలో తీవ్రంగా గాయపడిన సిఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ సాహుకు ముంచంగిపుట్టు ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స చేసిన అనంతరం పాడేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విశాఖకు తరలించారు.