తెలంగాణ

పార్టీ మారుతున్నానని దుష్ప్రచారం: డిఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 11: తాను టిఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరుతానని కొందరు తనపై దుప్ప్రచారం చేస్తున్నారని రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. తానంటే గిట్టని వారు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌లో చేరే ప్రసక్తే లేదని శుక్రవారం తెలంగాణ భవన్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో తెలిపారు. కొన్ని చానల్స్, పత్రికలు ఇష్టాను సారం రాస్తున్నాయని, కనీసం రాసే ముందు తన వివరణ తీసుకోవాలని అన్నారు. తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఎవరో వారి పేర్ల బయటపెట్టాలని డిమాండ్ చేశారు.