తెలంగాణ

ఆచార్య రవ్వా శ్రీహరి పంచ సప్తతి మహా గ్రంథం ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 11: మహామహోపాధ్యాయ ఆచార్య రవ్వా శ్రీహరి పంచసప్తతి మహోత్సవాల సందర్భంగా ఆయన రచనలపై రెండు రోజుల పాటు సమగ్ర సాహితీ సమాలోచనం జరగనుంది. శనివారం నాడు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోనూ, ఆదివారం నాడు శ్రీహరి విజయం పేరిట రవీంద్రభారతిలోనూ ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. శనివారం నాటి ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, తెలుగు వర్శిటీ విసి ఆచార్య ఎస్వీ సత్యనారాయణ హాజరవుతారు. ఆచార్య అమరేశం రాజేశ్వర శర్మ, ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యులు, ఎంపి రాపోలు ఆనందభాస్కర్, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, సాక్షి సంపాదకుడు కె రామచంద్రమూర్తి, ఆంధ్రజ్యోతి సంపాదకుడు డాక్టర్ కె శ్రీనివాస్‌లు పాల్గొంటారు. సభకు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షత వహిస్తారు. నిర్వహణ ఆచార్య కె యాదగిరి, పిల్లల మర్రి రాములు చేపడతారు. శ్రీహరి విమర్శ- పరిశోధన గ్రంథాలపై జరిగే సదస్సుకు ఆచార్య మసన చెన్నప్ప అధ్యక్షత వహిస్తారు. భాషా వ్యాకరణాల సదస్సుకు ఆచార్య ఆకురాతి పున్నారావు అధ్యక్షత వహిస్తారు. సంస్కృత రచనలు-అనువాదాల సదస్సుకు ఆచార్య నీలకంఠం, నిఘంటువులు సదస్సుకు ఆచార్య ఐనవోలు ఉషాదేవి అధ్యక్షత వహిస్తారు. సమాపన సదస్సుకు ఉస్మానియా యూనివర్శిటీ విసి ఆచార్య ఎస్ రామచంద్రం ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఆదివారం రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమానికి తెలంగాణ స్పీకర్ సిరికొండ మధుసూధనాచారి ముఖ్య అతిథిగా హాజరవుతారు.