తెలంగాణ

జాతీయ రహదారుల పనుల నత్తనడకపై మంత్రి ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 11: రాష్ట్రంలో కొత్తగా చేపట్టిన జాతీయ రహదారుల పనులు నత్తనడక నడుస్తున్నాయని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారులపై అధికారులతో శుక్రవారం సమీక్ష జరిపారు. గత సంవత్సరం కేంద్రం అనుమతించిన జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థకు బదిలీ చేసిన ఐదు రాష్ట్ర రహదారుల పనుల జాప్యం పై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 రోజుల్లో భూ సేకరణకు ల్యాండ్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఐదు జాతీయ రహదారుల అభివృద్ధికి గతంలో కేంద్రం ఎనిమిది వేల కోట్ల రూపాయల అనుమతులు ఇచ్చింది. గత ఆరునెలలుగా కన్సల్టెంట్లు, అధికారులు సరైన పురోగతి సాధించ లేకపోయారని, కొన్ని చోట్ల ఇంకా బై పాస్ లను ఖరారు చేయలేకపోయారని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. డిపిఆర్‌ల పేరుతో జాప్యం చేశారని అన్నారు. అధికారులు అలక్ష్యం ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూ సేకరణ ప్రక్రియ వెంటనే చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు.
ఖమ్మం- సూర్యాపేట, ఖమ్మం- అశ్వారావు పేట జాతీయ రహదారుల ఎలైనె్మంట్‌ను ఖరారు చేశారు. ఈ ఎలైనె్మంట్‌లో ఉన్న అన్ని పట్టణాలకు, పాలేరు, కూసుమంచి, జీళ్ల చేరువు, ఖమ్మం, వైరా, తల్లాడ, కల్లూరు, సత్తుపల్లి, గంగారం వంటి చోట్ల బై- పాస్ ల ఏర్పాటు కు మంత్రి ఆదేశాలు ఇచ్చారు.