తెలంగాణ

31 జిల్లాలు... 18మంది మంత్రులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 13: స్వాతంత్య్ర దినోత్సవం రోజున మంత్రులు, గణతంత్ర దినోత్సవం రోజున కలెక్టర్ జిల్లాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తెలంగాణలో 31 జిల్లాలు ఉండగా, మంత్రుల సంఖ్య మాత్రం 18. దీంతో స్పీకర్, చీఫ్‌విప్‌తో పాటు పలువురు సీనియర్ ఐఎఎస్ అధికారులకు సైతం జిల్లాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే బాధ్యత అప్పగించారు. ఏ జిల్లాలో ఎవరు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలో ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌లో గోల్కొండ వద్ద జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ముఖ్యమంత్రి కెసిఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. భూపాలపల్లి జిల్లాలో స్పీకర్ మధుసూధనాచారి జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. మహబూబాబాద్ జిల్లాలో స్పెషల్ చీఫ్‌సెక్రటరీ బిపి ఆచార్య, వరంగల్ అర్బన్‌లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, వరంగల్ రూరల్‌లో పల్లా రాజేశ్వర్‌రెడ్డి శాసన మండలిలో ప్రభుత్వ విప్, జనగాంలో విప్ బోడకంటి వెంకటేశ్వర్లు, రాజన్న సిరిసిల్లాలో ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు, కరీంనగర్‌లో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, జగిత్యాలలో శాసన సభలో ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లిలో శాసన మండలిలో చీఫ్‌విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆదిలాబాద్‌లో మంత్రి జోగు రామన్న, నిర్మల్‌లో దేవాదాయ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, మంచిర్యాలలో విప్ నల్లాల ఓదేలు, కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో శాసన మండలి చైర్మన్ కె స్వామిగౌడ్, సిద్దిపేటలో నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మెదక్‌లో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, సంగారెడ్డి లో స్పెషల్ చీఫ్‌సెక్రటరీ బిఆర్ మీనా, నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కామారెడ్డిలో ప్రభుత్వ విప్ గంప గోవర్దన్, మహబూబ్‌నగర్‌లో ఆరోగ్య శాఖ మంత్రి సి లక్ష్మారెడ్డి, నాగర్‌కర్నూల్‌లో పంచాయితీరాజ్ శాఖ మంత్రి జూపల్లికృష్ణారావు, వనపర్తిలో ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ ఎస్ నిరంజన్‌రెడ్డి, జోగులాంబ గద్వాల్‌లో పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఖమ్మం తుమ్మల నాగేశ్వరరావు, భద్రాద్రి కొత్తగూడెం టి పద్మారావు, నల్లగొండ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, సూర్యాపేట జి జగదీశ్‌రెడ్డి, యాదాద్రి భువనగిరి ప్రభుత్వ విప్ గొంగడి సునీత, వికారాబాద్ రవాణా శాఖ మంత్రి పి మహేందర్‌రెడ్డి, రంగారెడ్డి ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మేడ్చల్ హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌర వందనాన్ని స్వీకరిస్తారు.