తెలంగాణ

19, 20న బజరంగ్‌దళ్ జాతీయ కార్యవర్గ సమావేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 13: మత మార్పిడి, ముస్లిం రిజర్వేషన్లు, డ్రగ్స్ మాఫియా తదితర అంశాలపై విహెచ్‌పి, బజరంగ్‌దళ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వీటిని సమర్థవంతంగా ఎదుర్కొవడానికి ఈ నెల 19, 20వ తేదీల్లో నగరంలో జరగబోయే బజరంగ్‌దళ్ జాతీయ వర్గవర్గ సమావేశాల్లో చర్చించి నిర్ణయించనున్నట్లు బజరంగ్‌దళ్ రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్, ఉపాధ్యక్షుడు సుభాష్ చందర్, విహెచ్‌పి రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు, విహెచ్‌పి ప్రాంత ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి తెలిపారు. ఈ సమావేశాల్లో ఈ మేరకు తీర్మానం కూడా ఆమోదించనున్నట్లు వారు ఆదివారం ఆంధ్రభూమి ప్రతినిధికి చెప్పారు. రెండు రోజుల పాటు జరిగే సమావేశాల్లో పలు తీర్మానాలపై సవివరంగా చర్చించి ఆమోదించనున్నట్లు తెలిపారు. దేశంలో విచ్చల విడిగా సాగుతున్న మతమార్పిడిలను అడ్డుకోవాల్సిన అంశంపైనా చర్చించి తీర్మానం చేయనున్నట్లు వారు తెలిపారు. కేరళ, పశ్చిమ బెంగాల్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి, హిందు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, ప్రేమ పేరిట హిందూ అమ్మాయిలను వంచిస్తూ లవ్ జిహాద్ గురించి, చైనా దురాక్రమణ, చైనా వస్తువుల విక్రయాలు, స్వదేశీ, తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించి అమలు చేయాలనుకుంటున్న ముస్లిం రిజర్వేషన్లు, అనుమతి లేకుండా చర్చిల నిర్మాణం, గోరక్షకులపై పోలీసుల దౌర్జన్యాలు, అక్రమ కేసులు, దేవాలయాల్లో రాజకీయ జోక్యం, అయోధ్యలో రామాలయ నిర్మాణం, దేవాలయాల ఆస్తుల పరిరక్షణ తదితర అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నట్లు వారు తెలిపారు. ఈ సమావేశాలకు విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యాదక్షుడు ప్రవీణ్‌బాయ్ తొగాడియా, అధ్యక్షుడు రాఘవ రెడ్డి, సంయుక్త కార్యదర్శి సురేంద్ర జైన్, బజరంగ్‌దళ్ అఖిల భారత కన్వీనర్ మనోజ్‌వర్మ, కో-కన్వీనర్ సోనాల్ జీతో పాటు అన్ని క్షేత్రాల ప్రముఖులు హాజరవుతారని వారు వివరించారు. బాలస్వామి మాట్లాడుతూ 19న హైదరాబాద్‌లోని ఘన్‌శ్యాం భవన్ (గుజరాతీ ప్రగతి భవన్)లో సమావేశం జరుగుతుందని చెప్పారు. 20న సాయంత్రం కాచిగూడలోని మున్నూరుకాపు భవనంలో బహిరంగ సభ జరుగుతుందని ఆయన తెలిపారు.