తెలంగాణ

మూర్త్భీవించిన తెలుగుతేజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 13: సంస్కృత పద్యాలను సులువైన పదాలతో సామాన్యుడు కూడా అర్థం చేసుకునే విధంగా వ్రాయగల సాహితీవేత్త మహామహోపాధ్యాయ ఆచార్య రవ్వా శ్రీహరి మూర్త్భీవించిన తెలుగు తేజమని పాట్నా హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి అన్నారు. కవిత్వం పాండిత్యం సమపాళ్ళలో ఉన్న మేధావి అని ఆయన అన్నారు. ఆచార్య రవ్వా శ్రీహరి పంచసప్తతి మహోత్సవంలో భాగంగా ఆదివారం సాయంత్రం రవీంద్రభారతిలో ఆయన వ్రాసిన ‘పాణిని అష్ట్ధ్యాయి’ తెలుగు అనువాదాన్ని జస్టిస్ నర్సింహారెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రభుత్వ సలహాదారులు కెవి రమణాచారి మాట్లాడుతూ చేనేత కార్మికుని కుటుంబంలో జన్మించిన రవ్వా శ్రీహరి యాదగిరి నర్సింహస్వామి ఆశీర్వాదంతో సంస్కృత పాఠశాలలో వేదం నేర్చుకున్నారని, విశ్వవిద్యాలయం ఆవరణలో అడుగుపెట్టకుండానే విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షులుగా నియమితులైన రవ్వా శ్రీహరి నడిచే పుంభావ సరస్వతి అని కొనియాడారు. బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమైన వేదాన్ని ఆ కాలంలోనే రామానుజాచార్యులు సాహిత్యంలో రవ్వా శ్రీహరి సామర్థ్యాన్ని గమనించి పిలిపించుకొని వేదం నేర్పించారన్నారు. శ్రీకృష్ణ దేవరాయల కాలంలోని భువన విజయం 2017 సంవత్సరంలో శ్రీహరి విజయంగా రమణాచారి వ్యాఖ్యానించారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం విశ్రాంత అధ్యాపకులు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య మాట్లాడుతూ నర్సింహస్వామి అనుగ్రహంతో 37వేల పదాలతో నిఘంటువు వ్రాసారన్నారు. అన్నమయ్య 18వేల పద్యాలకు నిఘంటువు వ్రాసారు. ఎన్నో వేల మంది శిష్యులను తయారుచేసారు. ఈనాటి వరకు ఏ గ్రంథము తయారుకాని విధంగా ‘శ్రీహరి విజయం’ తయారైందన్నారు. సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మహా నిఘంటు నిర్మాణంలో రవ్వా శ్రీహరి పాత్ర గొప్పదని అన్నారు. ‘వాడుక భాషలో అపప్రయోగం’ అనే పుస్తకం రవ్వా శ్రీహరి వ్రాసారని తద్వారా ఎన్నో తప్పులు సరిదిద్దుకోగలిగామని అన్నారు. ఈ సందర్భంగా ‘శ్రీహరి నిఘంటువు’ పుస్తకాన్ని పొత్తూరి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాకతీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు ఎస్.లక్ష్మణమూర్తి, తెలుగు అకాడమి పూర్వ సంచాలకులు ఆచార్య కె.యాదగిరి, బిసి కమిషన్ సభ్యులు జూలూరి గౌరీశంకర్, రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనందభాస్కర్, డాక్టర్ వెలిచాల కొండలరావు తదితరులు పాల్గొని రవ్వా శ్రీహరిని భాషా సరస్వతిగా కొనియాడారు.

చిత్రం.. ఆచార్య రవ్వా శ్రీహరి ‘పాణిని అష్ట్ధ్యాయి’ తెలుగు అనువాదం గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న
జస్టిస్ నర్సింహారెడ్డి, కెవి రమణాచారి తదితరులు