తెలంగాణ

భూ యజమానిని బెదిరించి.. చెక్కులు తీసుకుని...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/గచ్చిబౌలి, ఆగస్టు 13: భూవివాదంలో తలదూర్చిన నలుగురు పోలీసు అధికారులపై కేసు నమోదు అయింది. కేసు నమోదైన వారిలో రాచకొండ కమిషనరేట్‌లో అడిషనల్ డిసిపిగా పనిచేస్తున్న అధికారి, మరో ముగ్గురు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న సిబ్బంది ఉన్నారు. పనిచేస్తున్న పోలీసు స్టేషన్‌లోనే పోలీసు అధికారులపై కేసు నమోదు కావడంతో చర్చనీయాంశంగా మారింది. కేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే టి. ఐశ్వర్యారెడ్డి రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలోని ఎన్‌సిసి అర్బన్‌లో నివాసం ఉంటున్నారు. అబూ బకర్ గ్రూప్‌కు చెందిన రెండు ఎకరాల భూమిని తీసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుని ఐదు లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చి ఐశ్వర్య జిపిఎ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్స్‌కు గడువు ఉన్నప్పటికీ అబూ బకార్ గ్రూప్ సిబ్బంది తమని మోసం చేసి మరొకరికి భూమిని విక్రయించారని ఐశ్వర్య ఆరోపిస్తున్నారు. ఐశ్వర్యరెడ్డి తండ్రి పులిందర్ రెడ్డి.. రాచకొండ కమిషనరేట్‌లో అడిషనల్ డిసిపిగా పని చేస్తుండడంతో ఆయన సహాయంతో రాయదుర్గం పోలీసులను ఆశ్రయించారు. జిపిఎ చేసుకున్న సమయంలో అబూ బకార్‌కు తన నివాసంలోనే ఐదు లక్షల రూపాయలు ఇచ్చానని, తనకు ఇస్తానన్న భూమిని మరొకరికి విక్రయించారని గత నెల 25న రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అబూ బకార్ గ్రూప్‌కు చెందిన వ్యక్తులను వారం రోజులుగా పిలిచి ఒత్తిడి చేస్తున్నారు. రెండు రోజుల క్రితం అదనపు డిసిపి పులిందర్ రెడ్డి, రాయదుర్గం సిఐ దుర్గప్రసాద్, ఎస్‌ఐ రాజశేఖర్, కానిస్టేబుల్ లక్ష్మినారాయణ.. అబూ బకార్ గ్రూప్‌కు చెందిన సభ్యులను పిలిచి భయపెట్టి రూ.60లక్షలకు చెక్కులు తీసుకున్నారు. దీంతో అబూ బకార్, కైసర్ సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్యను కలసి జరిగిన విషయంపై ఫిర్యాదు చేశారు. వెంటనే కమిషనర్ మాదాపూర్ డిసిపి విశ్వప్రసాద్‌ను విచారణ జరపాలని ఆదేశించారు. విచారణ అనంతరం సిపికి నివేదికను అందించారు. నలుగురు పోలీసులపై కేసు నమోదు చేయాలని సిపి ఆదేశాలు జారీ చేసి విచారణ అధికారిగా మాదాపూర్ ఎసిపి రమణ కుమార్‌ని నియమించారు. పని చేస్తున్న పోలీసు స్టేషన్‌లో కేసు ఎదుర్కోవడం సైబరాబాద్‌లో చర్చనీయాంశంగా మారింది. మాదాపూర్ ఎసిపి రమణ కుమార్ మాట్లాడుతూ కేసు నమోదు చేశామని, బలవంతంగా తీసుకున్న 60లక్షల చెక్కులను తిరిగి ఫిర్యాదుదారులకు ఇచ్చేసినట్లు తెలిపారు. పోలీసు అధికారులపై 448, 342, 384, 147, 506, ఐపిసి కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

రాయదుర్గం సిఐ దుర్గాప్రసాద్ (ఫైల్‌ఫొటో)