తెలంగాణ

చక్‌దే ఇండియా రైడ్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 13: రానున్న స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఆదివారం చక్ దే ఇండియా రైడ్ 3వ ఎడిషన్‌ను తెలంగాణ ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. మాదాపూర్ హైటెక్స్ కాంప్లెక్స్‌లోని నేషనల్ అకాడమి ఆఫ్ కనస్ట్రక్షన్స్ వద్ద హైదరాబాద్ బైసెక్లింగ్ క్లబ్ (హెచ్‌బిసి), భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. బోర్డ్ కంప్యూటర్, జిపిఎస్ వంటి నూతన టెక్నాలజీ కలిగిన అత్యాధునిక బైక్‌లను అజయ్‌మిశ్రా ఈ సందర్భంగా ప్రారంభించారు. సీనియర్ ఐఏఎస్ అధికారి సునీల్ శర్మ, హెచ్‌ఎండిఏ కమిషనర్ టి.చిరంజీవులు, తెలంగాణ సిఐఐ చైర్మన్ రాజన్న, హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ చైర్మన్ డివి మనోహర్ వంటి సీనియర్ అధికారులు, పలు కంపెనీల సిఈఓలు పాల్గొన్నారు. త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న మెట్రో రైలు సర్వీస్‌ను దృష్టిలో ఉంచుకుని కనెక్టివిటీ కోసం సైక్లింగ్‌ను ఎంచుకోవడం ఎంతో ముఖ్యమైనదిగా క్లబ్ తెలిపింది.
ఇందుకు గాను నగర వ్యాప్తంగా 500 బైక్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు క్లబ్ ఇప్పటికే నిమగ్నమై ఉంది. ఈ బైక్ స్టేషన్లలో 10 వేలకు పైగా అత్యాధునిక బైసైకిల్స్‌ను అందుబాటులో ఉంచేందుకు క్లబ్ ప్రయత్నిస్తోంది.