తెలంగాణ

డిసెంబర్ నాటికి ఎల్లంపల్లి, మిడ్‌మానేరు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 13:ఎల్లంపల్లి, మిడ్‌మానేరు పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ చివరి కల్లా పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. 2018 కొత్త సంవత్సరంలో అడుగుపెట్టే నాటికి ఎల్లంపల్లి నీళ్లు మిడ్ మానేరు ప్రాజెక్టులో పడాలని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిని మంత్రి హరీశ్‌రావు ఆదివారం నాడు జల సౌధలో సమీక్షించారు. ఈ ప్రాజెక్టు ఏడు పాత జిల్లాల రైతుల జీవితాలతో ముడిపడి ఉందని అన్నారు. 6,7,8 ప్యాకేజీలను ప్రతి వారం రెండు రోజుల పాటు సైట్‌లో ఉండి క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమీక్షించాలని ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డిని మంత్రి ఆదేశించారు. నవంబర్ చివరి కల్లా ఎలక్ట్రికల్, మెకానికల్ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. డిసెంబర్ కల్లా ఆరు, ఏడు, ఎనిమిది ప్యాకేజీలు పూర్తవుతాయని అన్నారు. వివిధ పనులకు సంబంధించి మంత్రి డెడ్‌లైన్‌లను ఖరారు చేశారు. నవంబర్ నాటికి పంపు హౌజ్లు, టనె్నల్ పనులు, ఇతర నిర్మాణాలు పూర్తి కావాలని అన్నారు. డిసెంబర్ నాటికి సర్జ్‌పూల్ పనులు పూర్తి చేసి డ్రై రన్ నిర్వహించాలని కోరారు. ఆయా ప్యాకేజీలకు చెందిన టనె్నల్స్, కెనాల్స్ లైనింగ్ పనులు అక్టోబర్, నవంబర్ కల్లా పూర్తిచేయాలని కోరారు. ప్రాజెక్టు పనులన్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయాలని మంత్రి కోరారు. మేడారం రిజర్వాయర్ పనులను వేగవంతం చేయాలని, రైతులకు పరిహారం వెంటనే ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. క్రాప్ హాలీడేకు సంబంధించిన ఫైలును వెంటనే క్లియర్ చేయాలని ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాసరాజ్‌ను ఆదేశించారు. సమావేశంలో ఇరిగేషన్ ఎఎన్‌సిసి మురళీధర్‌రావు, ఎత్తిపోతల పథకాల ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి, కాళేశ్వరం సిఈఎన్ వెంకటేశ్వర్లు, భూ సేకరణ సలహాదారు జి. మనోహర్, ఈఈ నూనె శ్రీ్ధర్ పాల్గొన్నారు.

చిత్రం.. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై జల సౌధలో అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి హరీశ్‌రావు