తెలంగాణ

రాజకీయ ఉనికి కోసమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, అగస్టు 13: రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు రాష్ట్రంలోని కొన్ని పార్టీలు ప్రాజెక్టులపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, ఉద్యమకాలంలోను, ఎన్నికల సమయంలోను ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సిఎం కేసిఆర్ అభివృద్ధి సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్తున్నారని అన్నారు. కృష్ణా, గోదావరి జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు వివిధ ప్రాజెక్టులను చేపడుతున్నామని, గత 70 ఏళ్లకాలంలో జరగని అభివృద్ధిని ఈ మూడేళ్లకాలంలో కెసిఆర్ చేసి చూపించారని చెప్పారు. గతంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టుల డిజైన్ల వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీలేదనే విషయాన్ని గ్రహించిన సిఎం రీడిజైన్లను చేపట్టి రాష్ట్రానికి కేటాయించిన 299 టిఎంసిల కృష్ణాజలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు ప్రాజెక్టులను చేపట్టారని అన్నారు. ప్రాజెక్టులు పూర్తయితే రాజకీయంగా కనుమరుగవుతామనే భయంతోనే ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తూ, కోర్టుల ద్వారా ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రాజెక్టులపై అవగాహన లేకుండా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని, వారు చేస్తున్న దీక్షలకు అర్థంలేదన్నారు.