తెలంగాణ

సాహితీ వైభవాన్ని చాటిచెబుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర, ఆగస్టు13: తెలంగాణ భాషా, సాహితీ వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకే రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కవి సమ్మేళనాలను నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత చెప్పారు. ఆదివారం నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రంలోని జిఎస్‌డి కల్యాణ మండపంలో నిర్మల్ జిల్లా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కవి సమ్మేళనంలో ఆమె పాల్గొన్నారు. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి చిత్రపటానికి పూలమాలలు వేసి కవి సమ్మేళన కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన కవులు తమ ప్రతిభపాటవాలను ప్రదర్శించారు. తెలంగాణ భాష, పల్లె జీవితం, సాహిత్యం, జానపదాలు తదితర వాటిపై కవులు తమ గళాన్ని వినిపించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, జాగృతి ఆధ్వర్యాన పది జిల్లాల్లో కవి సమ్మేళన కార్యక్రమాలను ఏర్పాటు చేసి, తెలంగాణ భాష, సాహిత్యాన్ని నలువైపుల వ్యాపింపజేసేందుకు తగిన చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం, ప్రస్థానం, తెలంగాణ సాహిత్యంపైనే ఆధారపడి ఉన్నదని అన్నారు.