తెలంగాణ

క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర, ఆగస్టు13: బాసర క్షేత్రాన్ని అభివృద్ధి పరచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం బాసర శ్రీ జ్ఞాన సరస్వతిదేవిని దర్శించుకున్న అనంతరం రాజన్న వసతి గృహంలో విలేఖరులతో మాట్లాడారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో 120 కోట్ల రూపాయలతో బాసర మాస్టర్ ప్లాన్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్నారు. బాసర ఆలయంలో అర్చకుల అపచారాలపై స్పందించాలని కోరగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని, వరుస సంఘటనల నేపథ్యంలో ప్రభుత్వం గట్టిచర్యలు తీసుకుందని, ఇద్దరు అర్చకులను సస్పెన్షన్‌ను సైతం విధించిందని అన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు త్వరలోనే బాసర క్షేత్రాన్ని సందర్శించి అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తారని ఆమె భరోసానిచ్చారు. ముధోల్ నియోజకవర్గ అభివృద్దికి ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని, ముధోల్ నియోజకవర్గంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాన్ని రూపొందిస్తామని పేర్కొన్నారు. బాసర ఆలయ పాలకవర్గాన్ని త్వరగా నియమిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ముధోల్ ఎమ్మెల్యే జి.విఠల్‌రెడ్డి, తెరాసా నాయకులు పాల్గొన్నారు.