తెలంగాణ

కాంగ్రెస్‌లో భారీ మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 14: వచ్చే నెలలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో భారీ మార్పులు ఉంటాయని ఎఐసిసి కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి ఆర్‌సి కుంతియా తెలిపారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా నియమితులైన ఆర్‌సి కుంతియా సోమవారం మీడియాతో కొంత సేపు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని అన్నారు. ప్రజలను ఆదుకునేది కాంగ్రెస్ ఒక్కటేనని ఆయన తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారనడానికి ఇటీవల తాము సంగారెడ్డిలో నిర్వహించిన బహిరంగ సభ సక్సెస్ కావడమేనని అన్నారు. 2019 ఎన్నికల వరకూ టిపిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డిని మార్చబోమని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమని, ఎవరైనా క్రమశిక్షణను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. పొత్తులపై ఇప్పుడే తొందరేమీ లేదని కుంతియా అన్నారు. దీనిపై తుది నిర్ణయం అధిష్ఠానం తీసుకుంటుందని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
అనుబంధ సంఘాలే కీలకం
గాంధీ భవన్‌లో జరిగిన పార్టీ అనుబంధ విభాగాల సమావేశంలో కుంతియా మాట్లాడుతూ పార్టీకి అనుబంధ విభాగాలే కీలకమని అన్నారు. ఆయా వర్గాల సమస్యలపై ప్రభుత్వంపై చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ముందుండి పోరాడాలని, భవిష్యత్తులో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే అనుబంధ సంఘాలు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎఐసిసి కార్యదర్శి మధుయాష్కి గౌడ్, ఎమ్మెల్యే సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.