తెలంగాణ

రెవెన్యూ వ్యవస్థను రద్దు చేయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 14: గ్రామ రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసి, వ్యవసాయ శాఖలో విలీనం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం తక్షణమే ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. దేశ జనాభాలో 62శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నందున ఈ ఆలోచన సరైనది కాదని అన్నారు. సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రెవెన్యూ వ్యవస్థను వేరే శాఖలో విలీనం చేయలేదని తెలిపారు. ప్రస్తుతం ఉన్న రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేసి, భూ హక్కు దారుల ప్రయోజనాలను కాపాడాల్సిన ప్రభుత్వం వ్యవసాయ శాఖలో విలీనం చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం వెంటనే అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలో వచ్చిన సూచనలు-సలహాల ఆధారంగా చర్యలు తీసుకోవాలని, వ్యవసాయ శాఖలో విలీనం చేసే ప్రతిపాదనను విరమించుకుని ఆ శాఖను పటిష్టం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం భూ వివాదంలో పోలీసు జులం ప్రదర్శించి, భూ యజమానులను బెదిరించి, బలవంతంగా చెక్కులపై సంతకాలు చేయించుకున్న అవినీతి పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వీరభద్రం డిమాండ్ చేశారు.