తెలంగాణ

రాజధానిలో ఆర్ట్ ఆఫ్ లివింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 14: ఆర్ట్ ఆఫ్ లివింగ్, యోగ పట్ల ఆసక్తి ఉన్న వారికో శుభవార్త. ఎటువంటి ఒత్తిళ్ళు లేకుండా, ఆనందంగా, ఉత్సాహంగా జీవించేందుకు ఉపయోగపడే ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ను ఈ నెల 18నుంచి 20వ తేదీ వరకు హైదరాబాద్‌లో శ్రీశ్రీరవిశంకర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా నేర్పించనున్నారు. హైదరాబాద్‌లో వందకు పైగా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు నగరంలోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యాలయం ప్రతినిధి వాణి సోమవారం ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు. ప్రతి కేంద్రంలో వేలాది మంది హాజరవుతారని, ఈ లెక్కన హాజరయ్యే వారి సంఖ్య లక్ష దాటుతుందని అంచనా వేస్తున్నామని ఆమె చెప్పారు. చేయడానికి చాలా పని ఉండి, సమయం చాలా తక్కువగా ఉండి, పని చేయడానికి శక్తి లేనప్పుడు మానసిక వత్తిడి పెరగుతుంది కాబట్టి శక్తిని పెంచుకోవడానికి ప్రాణాయామం, ధ్యానం, సుదర్శనక్రియ రోజంతటికీ కావాల్సిన శక్తిని అందించేందుకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఉపయోగపడుతుందని వాణి తెలిపారు. ఈ ప్రత్యేకమైన శ్వాస విధానం వల్ల మానసిక వత్తిడి, అలసట, కోపం, చిరాకు, ఆత్మన్యూనత వంటి చెడు భావనలు అన్నింటినీ తొలగించి, మనలను శక్తివంతంగా చేస్తుందన్నారు. అదే సమయంలో విశ్రాంతిగా, కేంద్రీకృతంగా ఉండేటట్లు చేస్తుందని ఆమె వివరించారు. గత 35 సంవత్సరాలుగా ఈ సుదర్శన క్రియ వివిధ వర్గాల ప్రజలను శ్వాస ద్వారా దగ్గర చేయగలిగిందన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆమె కోరారు. ఇతర వివరాలకు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఆర్ట్‌ఆఫ్‌లివింగ్.ఒఆర్‌జి/ఇన్-ఈఎన్/ఆనంద-ఉత్సవ్‌కు సంప్రదించవచ్చని ఆమె తెలిపారు.