తెలంగాణ

సామాజిక బాధ్యత నిర్వర్తించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 14: అనేక జబ్బులకు ఆహార అలవాట్లు, జీవన విధానమే కారణమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి లక్ష్మారెడ్డి తెలిపారు. అనారోగ్యానికి సంబంధించిన అంశాలపై ప్రజలకు ముందుగానే అవగాహన కలిగించాలని అన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కలిగించే కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. గచ్చిబౌలి కాంటినెంట్ ఆస్పత్రిలో ఫ్రీడమ్ ఫ్రమ్ స్ట్రోక్ అంబులెన్స్‌ను సోమవారం మంత్రి ప్రారంభించారు. వ్యాధిని గుర్తించే లోపే బ్రెయిన్ స్ట్రోక్ వల్ల అనేక మంది చనిపోతున్నారని, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వెంటనే వైద్య సహాయం అవసరమని అన్నారు. జీవన విధానం, ఆహారపు అలవాట్లు, వేగం, ఒత్తిడి వల్ల కారణంగా బ్రెయిన్ స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. ఇలాంటి వ్యాధుల పట్ల అవగాహన చైతన్యం పెరగాలని లక్ష్మారెడ్డి చెప్పారు.
సామాజిక బాధ్యతగా ప్రజలకు తక్కువ వ్యయంతో వైద్యం అందేట్టు చూడాలని అన్నారు. ప్రభుత్వ రంగంలోనూ ఆధునిక వసతులు కల్పిస్తున్నట్టు, అత్యాధునిక పరికరాలు అందిస్తున్నట్టు చెప్పారు. ప్రాథమిక స్థాయి నుంచి స్పెషాలిటీ స్థాయి వరకు ప్రభుత్వ దవాఖానాలను ఆధునీకరించినట్టు చెప్పారు. వ్యాధి నిరోధక టీకాలు, వ్యాధులు రాకుండా జాగ్రత్త పడటం, ఆదిలోనే వ్యాధులను గుర్తించడం, తగిన చికిత్స చేయించుకోవడం వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌లో తొలిసారి ప్రత్యేక న్యూరో అంబులెన్స్ ఏర్పాటు చేసినట్టు కాంటినెంటల్ హాస్పిటల్స్ చైర్మన్ తెలిపారు. దీని కోసం 040-6700000నెంబర్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అంబులెన్స్‌లో అన్ని రకాల పరీక్షలు చేసే సాంకేతిక పరికరాలు ఉన్నాయని చెప్పారు.