తెలంగాణ

రైతుల శ్రేయస్సే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీర్కూర్, ఆగస్టు 14: రాష్ట్రంలో రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న కెసిఆర్ ప్రభుత్వం కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకుందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పునరుద్ఘాటించారు. సోమవారం ఆయన కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో 13 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం వచ్చాక రైతులను ఆదుకునేందుకు విద్యుత్ రంగంపై ప్రత్యేక దృష్టిసారించి విద్యుత్ సమస్యలేకుండా చేశామని, వచ్చే యాసంగి నుండి 24 గంటల పాటు రైతుకు ఉచిత కరెంట్ అందించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీరు అందించే లక్ష్యంతో భారీ ఎత్తున ప్రాజెక్ట్‌ల నిర్మాణాన్ని ప్రభుత్వం వేగంవంతంగా చేపట్టిందన్నారు. కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలను నిజాంసాగర్ ప్రాజెక్ట్ రిజర్వాయర్‌లోకి తీసుకుని వచ్చి వచ్చే ఏడాది నుండి ఖరీఫ్, రబీలో రెండు పంటలు పండించేలా చూస్తామని అన్నారు.
నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కాల్వలను పూర్తి స్థాయిలో ఆధునికీకరిస్తున్నట్లు తెలిపారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా రైతాంగానికి ఇక సాగునీరు ఇబ్బంది లేకుండా చూస్తున్నామని అన్నారు. రైతుల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ ఆహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. పంటలు ఎండిపోయే పరిస్థితి వస్తే జిల్లాకు రావాల్సిన సింగూర్ జలాలను విడుదల చేయించి రైతులను ఆదుకునేందుకు సిఎం హామీ ఇచ్చారని అన్నారు. గ్రామ స్థాయిలో రైతు సంఘాలు ఏర్పాటు చేసి, రైతులు పండించిన పంటలు దళారులపాలు కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతుందన్నారు. ప్రతి గ్రామంలో ఇండ్లు లేని వారికి డబుల్ బెడ్‌రూం నిర్మించి ఇచ్చి తీరుతాం అని అన్నారు. బతుకమ్మ పండగ సందర్భంగా రాష్ట్రంలోని అర్హులైన మహిళలందరికీ చేనేత చీరలను ప్రభుత్వం కానుకగా ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తుందన్నారు. కుల వృత్తులను ప్రోత్సహించేందుకు గొర్రెల పంపిణీ చేస్తున్నామని అన్నారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో మంత్రి హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. బస్‌స్టాండ్ ఆవరణలో 12లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాన్స్‌వాడ ఆర్డీఓ రాజేశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ పెరిక శ్రీనివాస్, టిఆర్‌ఎస్ నియోజక వర్గ ఇన్‌చార్జి పోచారం సురేందర్‌రెడ్డి, ఎంపిటిసి సుధాకర్‌యాదవ్, గ్రామ సర్పంచ్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

చిత్రం.. బీర్కూర్ మండల కేంద్రంలో కొత్తగా నిర్మించిన పంచాయతీ భవనాన్ని ప్రారంభిస్తున్న మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి