తెలంగాణ

ప్రాజెక్టులను కాపాడుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఆగస్టు 14: పాలమూరు ప్రాజెక్టులను కాపాడుకుందామని, నీళ్ల కోసం, నిర్వాసితుల కోసం అండగా నిలుద్దామని వివిధ పార్టీల నేతలు, ప్రజాసంఘాల నాయకులు గొంతెత్తారు. సోమవారం మహబూబ్‌నగర్‌లోని అన్నపూర్ణ గార్డెన్‌లో టిజెఎసి, పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో నీళ్ల కోసం, నిర్వాసితుల కోసం అనే అంశంపై వివిధ పార్టీల నేతలతో కలిసి టిజెఎసి నేతలు రాజేందర్‌రెడ్డి, రాఘవచారి రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డికె.అరుణ, చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కిష్టారెడ్డి, టిడిపి మాజీ ఎమ్మెల్యేలు బక్కని నరసింహులు, దయాకర్‌రెడ్డితో పాటు సిపిఐ జిల్లా కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం జిల్లా కార్యదర్శి జబ్బార్, తెలంగాణ విద్యావంతుల వేదిక కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్, డిసిసి అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్, టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జి ఎన్‌పి వెంకటేష్‌తో పాటు వందలాది మంది నేతలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నేతలంతా పాలమూరు ఎత్తిపోతల పథకంతో పాటు కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను కాపాడుకోవాలంటూనే జూరాల ప్రాజెక్టు నుండి ఫేజ్-1గా పాలమూరు ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టాలని డిమాండ్ చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని రెండు ఫేజ్‌లుగా విభజిస్తేనే ఉమ్మడి పాలమూరు జిల్లాకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. జెఎసి రౌండ్‌టెబుల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 19వ తేదీ నుండి 20వ తేదీ వరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రచార ఉద్యమం చేపట్టాలని పాలమూరు జిల్లాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తిచూపుతూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని మొదటి తీర్మానం చేశారు.
అదేవిధంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ నెల 28వ తేదీన ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించాలని నిర్ణయించారు. నిర్వాసితుల కోసం అండగా నిలిచి పోరాటలు చేస్తున్న వారిపై పోలీసులు పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సమావేశంలో తీర్మానం చేశారు. జిల్లాలోని ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి వలసల నివారణకు చర్యలు తీసుకోవాలని నాయకులు ముక్తకంఠంతో తీర్మానాలను ఆమోదించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను రాజకీయంగా బతికించిన మహబూబ్‌నగర్ ప్రజలనే మోసం చేస్తున్నారని ఆరోపించారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మంజూరు చేశారని తెలిపారు. రీడిజైన్ పేరుతో జూరాల ప్రాజెక్టు నుండి కాకుండా శ్రీశైలం ప్రాజెక్టుకు తీసుకెళ్లి దగా చేశారని దుయ్యబట్టారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం మెడలు వంచడానికి అంతా ఉద్యమబాట పట్టాలని ఆమె పిలుపునిచ్చారు.
కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని నిర్విర్యం చేసి పాలమూరు జిల్లా ప్రజలను నట్టేట ముంచారని ఆరోపించారు. వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు కేటాయింపు ఉన్న కృష్ణానది నీటిలో మహబూబ్‌నగర్-రంగారెడ్డి జిల్లాల న్యాయమైన వాటాను ఇవ్వాలని కోరారు. టిడిపి మాజీ ఎమ్మెల్యేలు దయాకర్‌రెడ్డి, బక్కని నరసింహులు మాట్లాడుతూ పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జూరాల నుండి తీసుకుంటేనే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు మేలు జరిగేదనిఅన్నారు. 69 జిఓ ద్వారా నారాయణపేట, కొడంగల్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే ఈ ప్రాజెక్టును పక్కన పెట్టి కెసిఆర్ దగా చేశారని దుయ్యబట్టారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ పాలమూరు జిల్లాపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని, ప్రజలు గొంతు ఎత్తుతుంటే ప్రభుత్వం మేల్కొనాల్సి ఉందని వంటెద్దు పొకడపోతే టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి పతనం తప్పదని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, తెరాస ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పయనిస్తోందని ఆరోపించారు.

చిత్రం.. ప్రాజెక్టులపై రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు