తెలంగాణ

పోలీసులకు పతకాల బహూకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 15: పోలీస్ శాఖలో విశిష్ట సేవలకు గుర్తింపుగా పలువురు అధికారులకు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలో రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ పతకాలు అందజేసింది. అదనపు డిజిపి (శాంతిభద్రతలు) అంజనీకుమార్, డైరెక్టర్ జనరల్ (అగ్నిమాపక శాఖ) రాజీవ్ రతన్‌లకు ఇండిపెండెన్స్ డే-2016 ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ పురస్కారం లభించింది. అదేవిధంగా రిపబ్లిక్ డే-2016 ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్‌ను ఒఎస్‌డి, డిఐజీ (విఅండ్‌ఇ శాఖ) ఎన్ సూర్యనారాయణ (రిటైర్డ్), అదనపు పోలీస్ కమిషనర్, సిఏఆర్ హెడ్‌క్వార్టర్స్ ఎం శివప్రసాద్‌లకు అందజేశారు. రిపబ్లిక్ డే-2015 ఇండియన్ పోలీస్ మెడల్స్‌ను అదనపు ఎస్పీ (సిఐడి) టి శరత్‌బాబు, అదనపు డిసిపి (ట్రాఫిక్) నీలగిరి దివ్య చరణ్‌రావు, డిఎస్పీ (ఎస్బీ) కరీంనగర్ టి సుదర్శన్, సికిందరాబాద్ మహంకాళీ పోలీస్ స్టేషన్ ఏసిపి పుష్ప తిరుపతి, మాదాపూర్ ఏసిపి మదాడి రమణకుమార్, ఆర్‌ఐఎస్ డబ్ల్యు మాదంశెట్టి వెంకట్రావు, ఎస్‌ఐబి ఇంటెలిజెన్స్, హైదరాబాద్ పటోళ్ల మధుసూదన్‌రెడ్డి, ఏఎస్‌ఐ (కమ్యూనికేషన్స్) శవలి ప్రేమ్‌రాజ్, సయ్యద్ యూసుఫుద్దీన్ ఆర్‌ఎస్‌ఐ డిపిటిసి నల్గొండ, సైబరాబాద్ ఎస్బీ, హెడ్‌కానిస్టేబుల్ గజ్జెల లక్ష్మయ్య, హెడ్‌కానిస్టేబుల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ హైదరాబాద్ ఎ.దామోదర్‌రెడ్డి, డిఎఆర్ వరంగల్ సిద్దా సదానందంలకు పతకాలు బహూకరించారు. అదేవిధంగా ఇండిపెండెన్స్ డే-2016 పిపిఎంజి అవార్డులు అందుకున్న వారిలో ఎస్‌ఐ (మరణానంతరం) డి సిద్ధయ్య, పిసి (మరణానంతరం) సి నాగరాజులు ఉన్నారు.