తెలంగాణ

వచ్చే ఏడాదికి మిగులు విద్యుత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 15: విద్యుత్ సంక్షోభాల నుంచి రాష్ట్రం గట్టెక్కిందని, 2018-19నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రం హోదాను సాధిస్తామని జెన్కో సిఎండి దేవులపల్లి ప్రభాకరరావు ప్రకటించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి వల్ల విద్యుత్ డిమాండ్ పెరిగిందని, 11వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చినా తట్టుకునే శక్తి తెలంగాణకు ఉందని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం విద్యుత్ సౌధలో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జెన్కో సంస్థ రూ. 36వేల కోట్లతో 5880మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పుతున్నట్లు చెప్పారు. ఇంతవరకు 600మెగావాట్ల కాకతీయ థర్మల్, 240మెగావాట్ల జూరాల జలవిద్యుత్, 30మెగావాట్ల పులిచింతల ప్రాజెక్టు ఉత్పాదన ప్రారంభించినట్లు చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి పులిచింతల నుంచి మరో 90మెగావాట్ల జల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తామన్నారు. రాష్ట్రం అవతరించే నాటికి 6574 మెగావాట్ల విద్యుత్ కెపాసిటీ ఉండేదని, ఈ రోజు 13094 మెగావాట్లకు చేరుకుందన్నారు. వివిధ దశల్లో 15149మెగావాట్ల ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. ఎత్తిపోతల పథకాలకు అవసరమైన 8500 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ వచ్చేందుకు నిర్మించిన కారిడార్ నిర్మాణం పూర్తయిందన్నారు. ఈ ఏడాది జూలై నెలలో విద్యుత్ ట్రిప్ అయితే, యూనిట్ విద్యుత్ రూ.3.49పైసలకే 58 ఎంయు విద్యుత్ కొనుగోలు చేసి సరఫరా చేశామన్నారు. ఉత్తరాది రీజియన్ నుంచి ఈ విద్యుత్ తెప్పించామన్నారు. దక్షిణాదికి చెందిన ఐదు రాష్ట్రాలతో గ్రిడ్ సెక్యూరిటీకి అటంకం లేకుండా అవసరమైన విద్యుత్‌ను తెచ్చుకునేందుకు సహకార అవగాహన ఒప్పందం కుదిరిందన్నారు. కేంద్ర విద్యుత్ శాఖ కూడా ఈ విధానాన్ని స్వాగతించిందన్నారు. రాష్ట్రంలో సగటు విద్యుత్ వినిమయం గత మూడేళ్లలో 1010కిలోవాట్ల నుంచి 1394కిలోవాట్లకు పెరిగిందన్నారు. రాష్ట్రంలో 54ఇహెచ్‌టి సబ్‌స్టేషన్లు, 2832వరకు సర్క్యూట్ కి.మీ ఇహెచ్‌టి లైన్లు ఏర్పాటు చేశామన్నారు. సూర్యాపేట నుంచి శంకర్‌పల్లి వరకు 462కి.మీ పొడవున్న 400కెవి లైన్ వ్యవస్థను ప్రారంభించామన్నారు. ఈ ఏడాది 1962మెగావాట్ల సౌర విద్యుత్‌ను, 99మెగావాట్ల పవన విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేశామన్నారు.
తెలంగాణ విద్యుత్ శక్తి మొబైల్ యాప్
తెలంగాణ విద్యుత్ శక్తిమొబైల్ యాప్‌ను సిఎండి దేవులపల్లి ప్రభాకరరావు ప్రారంభించారు. విద్యుత్ డిమాండ్, డిస్కాంల వారీగా విద్యుత్ డిమాండ్, వివిధ జిల్లాల్లో వస్తున్న విద్యుత్ డిమాండ్, అంతకు ముందు ఏడాది వచ్చిన విద్యుత్ డిమాండ్ గణాంక వివరాలను ఈ యాప్‌లో పొందుపరిచినట్లు ఆయన చెప్పారు.

చిత్రం.. జెన్కో సిఎండి దేవులపల్లి ప్రభాకరరావు