తెలంగాణ

కొరవడిన సామాజిక న్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 15: కెసిఆర్ పాలనలో తెలంగాణలో సామాజిక న్యాయం కొరవడిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. 71వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా బిజెపి కార్యాలయంలో జాతీయ జండాను ఎగురవేసిన అనంతరం కార్యకర్తలను ఉద్ధేశించి బిజెపి అగ్రనేతలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధరరావు, అధ్యక్షుడు లక్ష్మణ్, శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. ముందుగా లక్ష్మణ్ మాట్లాడుతూ మతోన్మాద రాజకీయాలకు పాల్పడే ఎంఐఎం లాంటి పార్టీ కబంధ హస్తాల్లో టిఆర్‌ఎస్ కూరుకుపోయిందని, ఆ కబంధ హస్తాల నుండి రాష్ట్రాన్ని బయటకు తీసుకురావల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సామాజిక, ప్రజాస్వామిక తెలంగాణ వస్తుందని భావించామని, కానీ రాష్ట్రప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. దళితులు, బడుగు బలహీన వర్గాలపై పోలీసుల దమనకాండ పెరిగిపోతోందని, ప్రజల హక్కులను కాలరాసే విధంగా పనిచేస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణలో సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోలేకపోతున్నామని వాపోయారు. కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం వాటిని అమలుచేయకుండా నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి, బంధుప్రీతి, కుటుంబ పాలన పెరిగిందని వాటికి స్వస్తి పలికేందుకు ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, దేశభక్తి భావనను పెంచేందుకు, సమసమాజ స్థాపనకు నవ భారత నిర్మాణంలో పాలుపంచుకోవాలని లక్ష్మణ్ పిలుపునిచ్చారు.