తెలంగాణ

దేవాదాయ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: దేవాదాయ శాఖకు చెందిన భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హెచ్చరించారు. ఆక్రమణలు ఉంటే అన్యాక్రాంతమైన దేవాదాయ శాఖ భూములను స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. అత్తాపూర్ అనంత పద్మనాభ ఆయల భూములను మంత్రి గురువారం పరిశీలించారు. శ్రీపద్మనాభ స్వామి అలయానికి చెందిన భూముల అన్యాక్రాంతంపై ఫిర్యాదులు రావడంతో మంత్రి స్పందించారు. రెవెన్యూ శాఖ అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో భూములను పరిశీలించారు. అన్యాక్రాంతంపై దేవాదాయ శాఖ అధికారులు నోటీసులు ఇస్తే కొందరు కోర్టును ఆశ్రయించారని చెప్పారు. త్వరలోనే దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్‌తో సమీక్ష నిర్వహించనున్నట్టు మంత్రి చెప్పారు. అత్యంత విలువైన దేవాలయ భూములను ఆక్రమించుకున్నారని, సమగ్ర విచారణ జరిపి ఆలయ భూములు ఆలయానికే దక్కేట్టు చూడాలని కొందరు మంత్రికి ఫిర్యాదు చేశారు.