తెలంగాణ

2లక్షల మట్టి గణపతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: మట్టి గణపతి విగ్రహాలను ఏర్పాటు చేయడం ద్వారా పర్యావరణ హితంగా గణపతి ఉత్సవాలు చేసుకోవాలని మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె తారక రామారావు సూచించారు. మట్టి వినాయకుల ఏర్పాటుపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు శిల్ప కళావేదికలో గురువారం సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో రెండు లక్షల మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేయనున్నట్టు సమావేశంలో మాట్లాడిన మంత్రి కెటిఆర్ చెప్పారు. పిల్లల్లో పర్యావరణం పట్ల అవగాహన కలిగిస్తే పెద్దల్లోనూ మార్పు వస్తుందని అన్నారు. హైదరాబాద్ నగరంలో కోటి జనాభా ఉంది, గల్లీ గల్లీలో వినాయకుని విగ్రహాలను ప్రతిష్టిస్తారని పర్యావరణ హితమైన మట్టి విగ్రహాలనే ఏర్పాటు చేయాలని కోరారు. జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఏ, కాలుష్య నియంత్రణ బోర్డు, వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీకి నగర వ్యాప్తంగా విస్తృతంగా స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. దీని కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్ ఏర్పాటు చేయనున్నట్టు, ఫోన్ నంబర్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ముందు చూపుతో ఇప్పుడున్న చెరువులను రక్షించుకోవడానికి వినాయక నిమజ్జనం కోసం నగరంలో 22 కోట్ల రూపాయల వ్యయంతో 22 మినీ చెరువులను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వినాయకున్ని పూజిస్తే మంచి చదువు వస్తుందనే నమ్మకం పిల్లల్లో ఉందని, మట్టిగణేషున్ని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం అని పిల్లలు తల్లిదండ్రులకు చెప్పాలని అన్నారు. ప్రకృతి రక్షణే మన రక్షణ మన రక్షణే ప్రకృతి రక్షణ అని కెటిఆర్ పిల్లలతో ప్రతిజ్ఞ చేయించారు.
దేశం దృష్టిని ఆకట్టుకునే విధంగా హైదరాబాద్ నగరంలో వినాయక ఉత్సవాలు జరుగుతాయని మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. పర్యావరణాన్ని కాపాడే విధంగా మట్టి ప్రతిమలను ప్రోత్సహించాలని అన్నారు. ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, బాజిరెడ్డి గోవర్దన్, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫాసిదోద్దీన్, కమీషనర్ జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.