తెలంగాణ

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విదేశీ కరెన్సీ పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/శంషాబాద్, ఆగస్టు 17: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డిఆర్‌ఐ అధికారులు భారీ విదేశీ కరెన్సీ పట్టుకున్నారు. ఓ ప్రయాణికుడి వద్ద నుంచి రూ. 57 లక్షలు విలువ చేసే దిర్హం (దుబాయి) సౌదీ రియాల్స్ (సౌదీ అరేబియా), ఒమానీ రియాల్స్ (ఒమన్)ను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం అర్ధరాత్రి దాటాక దుబాయి (ఎమిరెట్స్ ఫ్లైట్)కి వెళ్లేందుకు ఇమ్మిగ్రేషన్, పాస్‌పోర్ట్ వంటి వాటిని క్లియరెన్స్ చేసిన డిఆర్‌ఐ హైదరాబాద్ జోనల్ యూనిట్ అధికారులు ప్రయాణికుడి బ్యాగ్, లగేజీని సోదా చేశారు. కాగా ప్రయాణికుడి బ్యాగ్‌లో విదేశీ కరెన్సీ లభ్యమయ్యాయి. విదేశీ కరెన్సీపై విచారించగా ఈ కరెన్సీ తనది కాదని, ఇతరులు పంపిస్తున్నారని, వీటిని దుబాయిలోని ఓ వ్యక్తి చేరవేయాలని ప్రయాణికుడు తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. దీంతో విదేశీ కరెన్సీ అక్రమ రవాణా నేరం కింద ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కోసం శంషాబాద్ పోలీసులకు అప్పగించినట్టు డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అదనపు డైరెక్టర్ గురువారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.