తెలంగాణ

తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల తీవ్ర జాప్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకు కేంద్రం పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేస్తున్నా పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రాజెన్ గోహైన్ పేర్కొన్నారు. స్థానిక సాంకేతిక సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. తెలంగాణలో వివిధ రైల్వే ప్రాజెక్టులను పెద్ద ఎత్తున చేపట్టేందుకు 17445 కోట్లతో పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఎంఎంటిఎస్ రెండో దశకు అయ్యే 860 కోట్ల ఖర్చులో రాష్ట్రప్రభుత్వ వాటా 2/3 వంతు అంటే 566 కోట్లుకు గానూ కేవలం 60 కోట్లు మాత్రమే కేటాయించిందని, రైల్వే శాఖ మొత్తం 395 కోట్లు కేటాయించి తన వంతు 283 కోట్లకు అదనంగా మరో 112 కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. ఘటకేశర్ నుండి రాయగిరి, యాదాద్రి వరకూ ఎంఎంటిఎస్‌ను పొడిగించాలని ముఖ్యమంత్రి రాసిన లేఖ మేరకు కేంద్రం ఆ వెంటనే బడ్జెట్‌లో ప్రవేశపెట్టినా రాష్ట్రప్రభుత్వం దీనికి నిధులు ఇవ్వలేదని చెప్పారు. 1160 కోట్ల అంచనా వ్యయంతో మనోహరాబాద్ -కొత్తపల్లి 148 కిలోమీటర్ల రైల్వే లైన్‌కు రైల్వేశాఖ , రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందని, ప్రధానమంత్రి పనులకు శంకుస్థాపన చేశారని ఆయన అన్నారు. ఈ ఒప్పందం మేరకు రాష్ట్రప్రభుత్వం ఉచితంగా భూమి ఇవ్వడంతో పాటు వ్యయంలో మూడో వంతు భరించాల్సి ఉంటుందని, కాని దీనికి సంబంధించి రాష్ట్రప్రభుత్వం 28 కిలోమీటర్ల భూమిని మాత్రమే రైల్వేశాఖకు అప్పగించిందని పేర్కొన్నారు. 2016-17 రైల్వే బడ్జెట్‌లో 2వేల మందికి ఉపాధి కల్పించే 270 కోట్ల అంచనా వ్యయంతో ఖాజీపేటలో రైల్వే వర్కుషాప్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించామని అన్నారు. ఈ పనులను రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్‌కు అప్పగించామని అన్నారు. కానీ 160 ఎకరాల భూమి అవసరం కాగా, రాష్ట్రప్రభుత్వం 54 ఏకరాల భూమి మాత్రమే అప్పగించిందని, అదీ దేవాదాయ శాకకు చెందిన భూమి అని తేలిందని పేర్కొన్నారు.