తెలంగాణ

రామగుండానికే ముందుగా నీళ్లివ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, ఆగస్టు 17: రాష్ట్రంలోని లక్షలాది ఎకరాలకు సాగునీరు... రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి తాగునీరు తరలించుకుపోతూ... ప్రాజెక్ట్ నిర్మాణానికి వేలాది ఎకరాల భూములను ధారాదత్తం చేసిన రామగుండంనకు సాగు, తాగునీరు ఇవ్వకుంటే ఎల్లంపల్లి నుంచి ఒక్క చుక్క నీరు కూడా బయటకు పోనివ్వమని శాప్ మాజీ చైర్మన్ రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ హెచ్చరించారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి రామగుండం నియోజకవర్గానికి సాగు, తాగు నీరు సరఫరా చేయాలనే ప్రధాన డిమాండ్‌తో గురువారం పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల కేంద్రం నుంచి పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వరకు 3 వేల మందితో 30 కిలోమీటర్ల జల సాధన పాదయాత్ర చేపట్టారు. ఎల్లంపల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేపట్టిన అనంతరం రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ వేలాది మంది రైతులు, గ్రామస్థులతో జలసాధన పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం రామగుండం ప్రాంతంపై సవతి ప్రేమను చూపుతోందని మండిపడ్డారు. ఎల్లంపల్లి నుంచి 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్ నగరం, కూకట్‌పల్లి, గచ్చిబౌలి, మేడ్చల్, బిహెచ్‌ఇఎల్, గజ్వేల్ ప్రాంతాలకు 60 టిఎంసిల వరకు నీటిని తీసుకుపోతూ రామగుండం నియోజకవర్గానికి రెండున్నర టిఎంసిల నీళ్లివ్వడంలో వివక్షను చూపుతుందని ఆగ్రహించారు. ఇక్కడి రైతాంగాన్ని మోసం చేస్తూ కన్నీళ్లు పెట్టిస్తున్నారని, ప్రభుత్వానికి రైతుల ఉసురు తాకుతుందని, స్థానిక పాలకుల చేతగానితనంతోనే నీటి కష్టాలు వస్తున్నాయని, ఇప్పటివరకు డిపిఆర్ రిపోర్టు తయారు చేయలేదని అన్నారు. అన్నాహజారే స్ఫూర్తితో శాంతియుతంగా జలసాధన పాదయాత్రలను చేపడుతున్నామని చెప్పారు. ఎల్లంపల్లి నుంచి రామగుండం పల్లెలకు సాగు, తాగు నీరు సరఫరా అయ్యేదాకా తన ఉద్యమం శాంతియుతంగా కొనసాగుతుందని, అవసరమైతే జలసాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు.