తెలంగాణ

రాష్ట్రంలో కోటి వ్యాక్సిన్ డోసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: మీసల్స్- రూబెల్లా టీకాలనును రాష్ట్రంలో కోటి వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేయనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి లక్ష్మారెడ్డి తెలిపారు. తొమ్మిది నెలల నుంచి 15 ఏళ్ల పిల్లలు అందరికీ టీకాలు వేయించనున్నట్టు చెప్పారు.గురువారం టీకాలు వేయడాన్ని ప్రారంభించిన మంత్రి ఐదు వారాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వేయనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో 90లక్షల ఒక వేయి 117 మంది పిల్లలకు టీకాలు వేయడానికి కోటి వ్యాక్సిన్ డోసులు సిద్ధంగా ఉంచామని చెప్పారు. 60లక్షల మంది పిల్లలు బడిలో, పది లక్షల మంది పిల్లలు బడి బయట, 20 లక్షల మంది పిల్లలు అంగన్‌వాడి కేంద్రాల్లో ఉన్నారని చెప్పారు. 88, 909 మంది సిబ్బంది టీకాలు వేయడానికి ఉన్నట్టు తెలిపారు. టీకాల ద్వారా ఎలాంటి సమస్యలు ఉండవని, ఇతర రాష్ట్రాల్లో కూడా టీకాలు వేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజీవ్ తివారి, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ వాకాటి కరుణ, హైదరాబాద్ ఇన్‌చార్జ్ కలెక్టర్ ప్రశాంతి, కార్పొరేటర్ విజయార్డె, ఆరోగ్య సంస్థ ప్రతినిధులు, ఇండియన్ పెడియాట్రిషీయన్స్ అసోసియేషన్ ప్రతినిధులు, అధికారులు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.