తెలంగాణ

లక్కారానికి తరలివచ్చిన అరుణాచల్ సిఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, ఆగస్టు 17: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లక్కారం గ్రామానికి అరుణాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం గురువారం కదిలివచ్చింది. చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామానికి చెందిన కడగంచి రమేష్ అరుణాచల్‌ప్రదేశ్ బిజెపి ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. అతని వివాహం మహబూబ్‌నగర్ జిల్లా మాడ్గులకు చెందిన విజయతో గురువారం చౌటుప్పల్‌లోని ఎంఆర్‌ఆర్ గార్డెన్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకలకు అరుణాచల్ ప్రభుత్వమే కదిలివచ్చింది. ముఖ్యమంత్రి పేమాఖండు, ఉపముఖ్యమంత్రి చౌనామన, హోంశాఖ మంత్రి కుమార్‌సాయి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజూజు, రైల్వేశాఖ సహాయ మంత్రి రాజన్‌గోహెన్, మాజీ ముఖ్యమంత్రి గెగాంగ్ అసాంగ్, బిజెపి ఉత్తర, తూర్పు ప్రాంతాల ఆర్గనైజింగ్ సెక్రటరీ అజయ్ జమ్‌వాల్, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు శాసనసభ్యులు, ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు కదిలివచ్చి వధూవరులను ఆశీర్వదించారు. అరుణాచల్‌ప్రదేశ్ సిఎంతో పాటు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు రావడంతో రాచకొండ పోలీస్ సహాయ కమిషనర్ తరుణ్‌జోషి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ట్రాఫిక్ ఉన్నతాధికారులు హైవే వెంట ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి బృందం ముందుగా అటవీశాఖ అతిధిగృహానికి చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, రాచకొండ జాయింట్ కమిషనర్ తరుణ్‌జోషి, డిసిపి యాదగిరి బృందానికి స్వాగతం పలికారు. అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి ఇక్కడి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

చిత్రం..పెళ్లి వేడుకల్లో పాల్గొన్న అరుణాచల్ ముఖ్యమంత్రి పేమాఖండు బృందం