తెలంగాణ

కార్మికులను మోసగించిన సర్కార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 18: సింగరేణి కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం మోసగించిందని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో సింగరేణి కార్మికుల ఓట్ల కోసం టిఆర్‌ఎస్ సింగరేణి కార్మికులకు అనేక హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించిందని ఆయన విమర్శించారు. ఈ నెల 21న సింగరేణి కాలరీస్ గుర్తింపు సంఘం ఎన్నికల షెడ్యూలు వేస్తున్న నేపథ్యంలో శుక్రవారం గాంధీ భవన్‌లో పార్టీకి అనుబంధంగా ఉన్న సింగరేణి సబ్-కమిటీ చైర్మన్ గండ్ర వెంకటరమణా రెడ్డి అధ్యక్షతన గాంధీ భశన్‌లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రసంగిస్తూ సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాల విషయంలో టిఆర్‌ఎస్ పెద్ద ఎత్తున మోసం చేసిందని, ఎన్నికల సమయంలో ఖచ్చితంగా ఇస్తామని హామీ ఇచ్చిన వాటిని అమలు చేసేంత వరకూ తాము పోరాటం చేస్తామని అన్నారు. గుర్తింపు ఎన్నికలు వస్తుండడంతో ఆదరబాదరగా వారసత్వ ఉద్యోగాల జివో ఇచ్చి, తిరిగి తెలంగాణ జాగృతి వాళ్ళ చేత కోర్టులో కేసు వేయించి మోసగించారని ఆయన విమర్శించారు. సింగరేణి కాంట్రాక్టు ఉద్యోగాల విషయంలో కూడా అలాగే చేశారని ఆయన విమర్శించారు. కార్మికులకు ఇళ్ళు కట్టిస్తామన్న హామీని నిలబెట్టుకోలేదన్నారు. ఇలా ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని ఉత్తమ్ విమర్శించారు.