తెలంగాణ

పరిశోధన కోసం గగనంలోకి 10 బెలూన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 18: పరిశోధనల కోసం హైదరాబాద్ కేంద్రంగా గగనంలోకి 10 బెలూన్లను వదలిపెట్టనున్న టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ విభాగం, భారత ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ఆగస్టు ఒకటి నుంచి 30 వరకు గగనంలోకి వదలనున్న ఈ బెలూన్లలో హైడ్రోజిన్ గ్యాస్ నింపినట్టు టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ సైంటిస్ట్ ఇన్ ఇన్‌చార్జి బి సునీల్ పేర్కొన్నారు. గగనతలంలోకి ఇవీ 17 నుంచి 30 కి.మీ ఎత్తు వరకు వెళ్లి తిరిగి భూతలానికి చేరుకుంటాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు 200 నుంచి 300 కి.మీ దూరంలో భూతలానికి చేరుకుంటున్నాయని తెలిపారు. మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో ఇవీ భూతలానికి చేరుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. బెలూన్లను గుర్తించిన వెంటనే వాటి సమాచారాన్ని సమీప పోలీస్ స్టేషన్లకు గానీ అధికారులకు తెలియజేయాలని పేర్కొన్నారు. బెలూన్లను ధ్వంసం చేయడం కానీ వాటిని తెరిచే ప్రయత్నం చేయడం ప్రమాదకరమని హెచ్చరించారు. సమాచారం ఇచ్చిన వారికి తగిన పారితోషకంతో పాటు టెలిగ్రామ్, ఫోన్ కాల్స్, రవాణా చార్జీలను చెల్లించనున్నట్టు పేర్కొన్నారు.