తెలంగాణ

బాలుడి కిడ్నాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, ఆగస్టు 19: మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధిలో 14ఏళ్ల బాలుడి కిడ్నాప్ జరిగింది. ఏపిలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన వై. గిరిబాబు తన భార్య కుమారుడు మణిందర్(14)తో కలిసి వలసవచ్చి నివాసం ఉంటున్నారు. మణిందర్ పట్టణంలోని నాగార్జున్ టాలెంట్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు. శనివారం ఉదయం 8-30 గంటలకు స్కూల్‌కు సైకిల్‌పై బయల్దేరిన మణిందర్‌ను మేడ్చల్ కిష్ఠాపూర్ మార్గమధ్యలో వాగు దాటిన తర్వాత సిల్వర్ రంగులో కారులో వచ్చిన దుండగులు మాయమాటలు చెప్పి కారులో అపహరించారు. అతని వద్ద తండ్రి గిరిబాబు ఫోన్ నంబర్ తీసుకున్నారు. తర్వాత బాలుడి తండ్రికి ఫోన్ చేసి రూ. 10 లక్షలు ఇవ్వాలని లేకుంటే మీ కుమారుడికి అపాయం తలపెడుతామని బెదిరించారు. దీంతో భయభ్రాంతులకు గురైన తల్లితండ్రులు వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించారు. కిడ్నాపర్ ఫోన్ చేసిన నంబర్ ఆధారంగా బాలుడు మండలంలోని పూడూరులో ఉన్నట్లు గుర్తించారు. కిడ్నాపర్ ఫోన్ నంబర్ ఆధారంగా లోకేషన్‌ను ట్రేస్ చేసేందుకు ప్రయత్నించారు. ఇంతలో సాయంత్రం 4గంటల సమయంలో పూడూరు గ్రామ పరిధిలోని ఓ క్వారీ వద్ద బాలుడు ఉన్న సమాచారాన్ని గ్రామస్థులు పోలీసులకు చేరవేశారు. దీంతో హుటాహుటిన పోలీసులు అక్కడకు చేరుకుని బాలుడిని క్షేమంగా ఠాణాకు తీసుకువచ్చారు. బాలుడిని తాళ్లతో బంధించగా బాలుడు ధైర్యం చేసి బయటకు వచ్చినట్లు ఎసిపి పేర్కొన్నారు. కిడ్నాపర్‌ల ను త్వరలోనే పట్టుకుంటామని దీమా వ్యక్తం చేశారు.

చిత్రం..ఎసిపి,సిఐలతో కిడ్నాప్‌కు గురైన బాలుడు మణిందర్