తెలంగాణ

రజాకార్ వారసత్వ రాజకీయాలపై పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,ఆగస్టు 19: తెలంగాణలో రజాకార్ వారసత్వ రాజకీయాలకు విరుద్ధంగా పోరాటం కొనసాగించాలని బిజెపి ఆధినాయకత్వం భావిస్తోంది. బిజెపి ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు శనివారం తనను కలిసిన విలేఖరులతో ఈ విషయం సూచనప్రాయంగా చెప్పారు. తెలంగాణలో బలపడేందుకు బిజెపి వద్ద బలమైన ఆయుధాలున్నాయని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో కొన్ని పార్టీలు రజాకార్ వారసత్వ రాజకీయాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించకపోవటం గమనార్హమన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించకపోవటం దేనికి సంకేతమని మురళీధర్ రావు ప్రశ్నించారు. తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతోందంటూ, ఈ అంశంతో తాము ప్రజల వద్దకు వెళతామన్నారు. తెలంగాణలో బిజెపిని బలపరిచేందుకు వీటిని ఆయుధాలుగా ఉపయోగించుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ, ఆంధ్రాలో అభివృద్ధితోపాటు అవినీతి కూడా భారీగా జరుగుతోందని మురళీధర్ రావు ఆరోపించారు. సరైన సమయంలో ఈ అంశాలను ప్రస్తావిస్తామని ఆయన చెప్పారు. ఏపి బిజెపి అధ్యక్షుడు హరిబాబును కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారా? అనే ప్రశ్నకు బదులిస్తూ ‘ఆయనకు ఏదోఒకటి ఇస్తారు, రోడ్డుమీదైతే వదిలివేయరు కదా?’ అని ఎదురు ప్రశ్న వేశారు. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఈ నెలాఖరులో ఏపిలో పర్యటిస్తారని మురళీధర్‌రావు చెప్పారు.
వాస్తవానికి ఆయన తెలంగాణలో పర్యటించాలనుకున్నారనీ, అయితే ఆయన ఇటీవలే అక్కడ పర్యటించినందున ఏపి పర్యటనకు వస్తున్నారని ఆయన వివరించారు.