తెలంగాణ

మేం రాజీనామా చేస్తాం.. మీరు సిద్ధమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 19:మేం శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తాం మీరు రాజీనామా చేసి పోటీకి సిద్ధమా అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సవాల్ చేశారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టిఆర్‌ఎస్‌లో చేరిన రామ్మోహన్‌రెడ్డి రాజీనామా చేసి పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు, వంశీచంద్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా? అని సవాల్ చేశారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి శనివారం టిఆర్‌ఎస్ ఎల్‌పి కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. పాలమూరు జిల్లాకు చెందిన టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం, అదే విధంగా జిల్లాకు చెందిన కాంగ్రెస్ శాసన సభ్యులు రాజీనామా చేసి తిరిగి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారా? అని సవాల్ చేశారు. కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే సవాల్ స్వీకరించాలని అన్నారు.