తెలంగాణ

పరిహారం చెల్లించకుండా పబ్లిక్ హియరింగ్ చేపడితే ప్రతిఘటిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 19: భూ నిర్వాసితులకు చట్టబద్ధమైన పరిహారం చెల్లించకుండా భూములు స్వాధీనం చేసుకోవాలనుకున్నా, పబ్లిక్ హియరింగ్ నిర్వహించాలనుకున్నా ప్రతిఘటిస్తామని తెలంగాణ భూ నిర్వాసితుల పోరాట కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో మల్లన్న సాగర్‌లో మొదలైన నిర్వాసితుల తిరుగుబాటు 15 జిల్లాలకు వ్యాపించిందని కమిటీ రాష్ట్ర కన్వీనర్ బి. వెంకట్, కో-కన్వీనర్ టి. సాగర్, ధర్మానాయక్‌లు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఇతర అభివృద్ధి పేరుతో తెలంగాణ ప్రభుత్వం చట్ట సభలు చేసిన శాసనాలను అమలు చేయకుండా చట్ట ఉల్లంఘనకు పాల్పడుతున్నదని వారు విమర్శించారు. రైతులను బెదిరించి, భయపెట్టి నామమాత్రమైన పరిహారం ఇచ్చింది తప్ప, చట్ట ప్రకారం ఇవ్వలేదని వారు తెలిపారు.