తెలంగాణ

సిసిఎల్‌ఏను నియమించాలి: చాడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 19: రెవెన్యూ శాఖలో అత్యంత కీలకమైన భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సిసిఎల్‌ఏ) పోస్టును తక్షణమే భర్తీ చేయాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సిఎం కెసిఆర్‌ను కోరారు. ఇటీవల సమగ్ర భూ సర్వే చేపడతామని ప్రభుత్వం చెబుతుంటే, మరో వైపు భూ కుంభకోణాలపై విచారణ చేపట్టాల్సిన అవసరం ఉండగా, భూమి రికార్డులను కంప్యూటరీకరణ చేయాలని కూడా ప్రభుత్వం ప్రతిపాదించిన పరిస్థితుల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన సిసిఎల్‌ఏను ఎందుకు నియమించడం లేదని సిఎం కెసిఆర్‌ను చాడ ప్రశ్నించారు. తక్షణమే సిసిఎల్‌ఏను భర్తీ చేయాలని చాడ సిఎం కెసిఆర్‌కు రాసిన లేఖలో కోరారు.
రెవెన్యూ వ్యవస్థ రక్షణకు సిద్ధం కండి
రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసి వ్యవసాయ పంచాయతీ శాఖలో విలీనం చేయాలని, విఆర్‌ఏ, విఆర్వోలను రైతు సమాఖ్యల కింద పని చేసే విధంగా మార్పులు చేయాలన్న ప్రభుత్వ ఆలోచనను ఉపసంహరించుకోవాలని తెలంగాణ గ్రామ రెవిన్యూ సహాయకుల సంఘం డిమాండ్ చేసింది.