తెలంగాణ

బయ్యారం ప్లాంట్ ఏర్పాటు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 19: బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు కేంద్ర ప్రభుత్వ గనుల శాఖ కార్యదర్శి అరుణ్ కుమార్‌ను కోరారు. అరుణ్‌కుమార్‌ను శనివారం కలిసిన కెటిఆర్ రాష్ట్రానికి చెందిన పలు పెండింగ్ అంశాలను వివరించారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం హామీ ఇచ్చిన బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని అన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను నెరవేర్చడంలో కేంద్రం శ్రద్ధ వహించడం లేదని కెటిఆర్ అన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తరపున బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం పలుమార్లు కేంద్ర మంత్రులను కలిసినప్పటికీ ఈ అంశంపై ఎలాంటి పురోగతి లేదని అన్నారు. గతంలో ఇనుప ఖనిజం ఏమాత్రం లేని విశాఖలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసిన కేంద్రం, అవసరమైన మేరకు ఇనుప ఖనిజ నిల్వలు ఉన్న బయ్యారంలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేయడంలో ఆలస్యం చేస్తోందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహకరిస్తామని వెంటనే స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కార్యాచరణ ప్రారంభించాలని కెటిఆర్ కోరారు. ఖమ్మం లోని వెనుకబడిన ప్రాంతంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అత్యవసరమని, దీనిపై తెలంగాణ ప్రభుత్వం తమ ప్రయత్నాలను కొనసాగిస్తుందని కేంద్ర ప్రభుత్వ గనుల శాఖ కార్యదర్శి అరుణ్ కుమార్‌కు పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు.

చిత్రం..హైదరాబాద్‌లో శనివారం కేంద్ర గనుల శాఖ కార్యదర్శితో సమావేశమైన మంత్రి కెటిఆర్