తెలంగాణ

అప్రజాస్వామిక విధానాలపై పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ఖైరతాబాద్, ఆగస్టు 19: తెలంగాణ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలపై సమిష్టి పోరు సాగిద్దామని అఖిలపక్ష నేతలు తీర్మానించారు. శనివారం టి.జెఎసి ఆధ్వర్యంలో ‘సభలు, సమావేశాలు జరుపుకునే హక్కు-ప్రభుత్వ ఆంక్షలు’ అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు లింగయ్య అధ్యక్షత వహించారు. ఈ సదస్సులో ప్రొఫెసర్ కోదండరామ్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, బిజెపి నేత మనోహర్ రెడ్డి, న్యూడెమోక్రసి నాయకులు రమాదేవి, గోవర్ధన్, ప్రొఫెసర్ పిఎల్ విశే్వశ్వరరావు, న్యాయవాధి రచనారెడ్డిలతో పాటు ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో నిజాం కాలం కంటే నిర్భందాలు అధికంగా ఉన్నాయని, ముఖ్యమంత్రి కెసిఆర్ నియంతలా వ్యవహారిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ కుటుంబం తీవ్ర అభద్రతా భావంతో ఉందని న్యాయవాది రచనారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 151, 144, 30 తీవ్రంగా దుర్వినియోగం అవుతున్నాయని, ముందస్తు అరెస్టుల పేరుతో ప్రజల పక్షాన నిలిచే వారిని సాదారణ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజా ఉద్యమాల ద్వారా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ధర్నాచౌక్, సభలు, సమావేశాలు జరుపుకునే హక్కు కోసం సమినార్ నిర్వాహించుకోవాల్సి రావడం దౌర్భాగ్యమైన పరిస్థితి అని న్యూడెమోక్రసీ నాయకులు రమాదేవి అన్నారు.
ప్రజాస్వామిక దేశంలో కేసీఆర్ అప్రజాస్వామిక విధానాలు ఎంతో కాలం కొనసాగవన్న విషయాన్ని గుర్తించాలని అన్నారు. పోలీసులచే ప్రజా ఆగ్రహాన్ని ఆపలేరన్న విషయాన్ని ఇప్పటికైనా కెసిఆర్ తెలుసుకొని ప్రజారంజకమైన పాలనను అందించాలని కోరారు. తెలంగాణ ప్రజలు కేవలం ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా పాలించమని, భారత రాజ్యాంగం విలువలను అమలు చేయమని మాత్రమే కోరుతున్నారని, న్యాయమైన వాటిని నెరవేర్చలేక పౌరులపై పోలీసులను ఉసిగొల్పడం ఏమిటని ప్రశ్నించారు. హక్కుల ఉల్లంఘనలు తారాస్థాయికి చేరుతున్న నేపధ్యంలో తెలంగాణలోని అన్ని పార్టీలు, సంఘాలు, వ్యక్తులు ఏకమై పోరాడాల్సి ఉందన్నారు. ఇందు కోసం ప్రజాస్వామిక హక్కుల ఉల్లంఘనలపై న్యాయస్థానాలను ఆశ్రయించడంతో పాటు ప్రజల్లో చైతన్యం కలిగించే అంశాలపై దృష్టిసారించాలని నిర్ణయించారు. వీటితో పాటు అసెంబ్లీ సమావేశాల్లో హక్కుల ఉల్లంఘనపై ప్రత్యేక చర్చ జరిగేలా శాసన సభ్యులు కృషి చేయాలని కోరారు.

చిత్రం..‘సభలు, సమావేశాలు జరుపుకునే హక్కు-ప్రభుత్వ ఆంక్షలు’ అనే అంశంపై శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సదస్సులో ప్రసంగిస్తున్న జెఎసి చైర్మన్ కోదండరామ్