తెలంగాణ

23న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల చలో సెక్రటేరియట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 20: తెరాస పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని తెలంగాణ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా వేతనం చెల్లించాలని, ఉద్యోగ భధ్రత కల్పించాలని డిమాండ్ చేసింది. ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జె.వెంకటేశ్, జె.కృష్ణారెడ్డి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. డిమాండ్ల సాధన కోసం ఈ నెల 23న చలో సెక్రటేరియట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది చలో సెక్రటేరియట్‌లో పాల్గొనాలన్నారు.