తెలంగాణ

రుణాలు ఇవ్వరు.. పరిహారం రాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 20: రాష్ట్రంలో కౌలు రైతుల (టెనెంట్ ఫార్మర్స్) ఘోష తీరటం లేదు. గత రెండు దశాబ్దాల నుండి భూమి కలిగిన పట్టేదారులు (రైతులు) వివిధ కారణాల వల్ల తమ భూములను కౌలుకు ఇచ్చి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికో మరో నగరానికో, పట్టణానికో జీవనం కోసం వెళుతున్నారు. పట్టేదారులు గ్రామాల్లోని తమ భూములను కౌలుకు ఇస్తున్నారు. రాష్ట్రంలో 56లక్షల మంది రైతులు (పట్టేదారులు) ఉండగా వీరిలో దాదాపు 20లక్షల మంది సేద్యాన్ని వదిలి వేశారు. వీరి భూములను పడావు (వృథాగా ఉంచకుండా) పెట్టకుండా ఇతరులు కౌలుకు (కౌలు రైతులు) చేస్తున్నారు. రాష్ట్రంలో 100లక్షల ఎకరాలకు పైగా సాగవుతుండగా, ఇందులో 40లక్షల ఎకరాలు కౌలు రూపంలో సాగవుతోంది. ఎకరానికి ఐదువేలో, పదివేలో ఇవ్వడం లేదా, పండిన పంటలో కొంత భాగం పట్టా కలిగిన రైతులు కౌలు పేరుతో ఇవ్వడం సాధారణంగా జరుగుతోంది. తెలంగాణలో పెద్ద ఎత్తున కౌలుపై సాగవుతున్నప్పటికీ, కౌలు రైతులకు ఎలాంటి హక్కులు ఉండటం లేదు. పంట రుణాలు, వ్యవసాయ రుణాలు ఈ రైతులకు అందడం లేదు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో పంట నష్టపోతే ప్రభుత్వం నుండి పరిహారం వీరికి అందడం లేదు. అలాగే పంటల బీమా కూడా వీరికి వర్తించడం లేదు. బ్యాంకుల నుండి కౌలు రైతులకు రుణాలు లభించకపోవడంతో అధిక వడ్డీ(వందకు మూడు రూపాయల నుండి ఐదు రూపాయలకు వడ్డీ)పై ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల నుండి రుణాలు తీసుకుంటున్నారు. పంటలకు నష్టం కలిగితే ఈ రుణాలు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పట్టేదారులు తమ భూములను కౌలుకు ఇస్తున్నట్టు లిఖిత పూర్వకంగా ఇవ్వకపోవడమే కౌలురైతుల ఇక్కట్లకు కారణమని ఒక సర్వేలో తేలింది. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం దీర్ఘకాలంగా ఒకరి భూమిని మరొకరు సాగు చేస్తూ ఉంటే సాగుచేసే వారే సంబంధిత భూములకు యజమానులుగా మారేందుకు వీలుంది. అందుకే వాస్తవంగా కౌలుపేరుతో సాగు చేస్తున్న కౌలురైతుల పేర్లు రికార్డుల్లోకి ఎక్కడం లేదు. పట్టేదారులు లిఖితపూర్వకంగా తమ భూమిని ఫలానా వ్యక్తికి కౌలుకు ఇస్తున్నామని రాసి ఇస్తే, దాని ఆధారంగా రెవెన్యూ అధికారులు రుణ అర్హత కార్డు (లోన్ ఎలిజిబిలిటీ కార్డు-ఎల్‌ఇసి) ఇచ్చేందుకు వీలవుతుంది. ఎల్‌ఇసి ఉన్న రైతులకు మాత్రమే బ్యాంకర్లు పంట రుణాలు, వ్యవసాయ రుణాలు ఇచ్చేందుకు వీలవుతుంది. 2011 లో ఎల్‌ఇసి ఇచ్చే ప్రక్రియ అమల్లోకి వచ్చినప్పటికీ, 40వేల మందికే ఈ కార్డులు లభించాయి. తెలంగాణ ఏర్పాటుకు ముందు 14లక్షల మందికి ఎల్‌ఇసి కార్డులు ఇస్తామని టిఆర్‌ఎస్ హామీ ఇచ్చింది. ఈ హామీ వాస్తవంగా అమల్లోకి రాలేదని ఆరోపణలు వస్తున్నాయి.