తెలంగాణ

రైతుల పాలిట దేవుడు కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అగస్టు 20: ఈ ఆర్థిక సంవత్సరం వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఆదివారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రైతుల పాలిట దేవుడని, ఆయన గొప్ప దార్శనికత కలిగిన కర్షకుడని అన్నారు. గ్లోబల్ అగ్రికల్చర్ సమిట్ కమిటీ కెసిఆర్‌కు వ్యవసాయ నాయకత్వ అవార్డు ఇవ్వడం గొప్ప విషయమని ఆయన అభినందించారు. హరిత పితామహుడు, ప్రపంచమే గర్వపడే ప్రఖ్యాత వ్యవసాయ శాస్తవ్రేత్త స్వామినాథన్ సారధ్యంలోని 20 మంది సభ్యులు ఉన్న గ్లోబల్ అగ్రికల్చర్ సమిట్ సొసైటీ ఈ అత్యుత్తమ అవార్డుకు కెసిఆర్‌ను ఎంపిక చేయడం యావత్ తెలంగాణకు గర్వకారణమని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏ ఒక్క ముఖ్యమంత్రికి కూడా ఈ అవార్డు రాలేదని, సమైక్య పాలకులు ధ్వంసం చేసిన వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టి రైతుల కండ్లలో ఆనందం చూసేందుకు కెసిఆర్ మూడేళ్లలో ఎంతో తపనతో చేస్తున్న నిర్విరామ కృషి ఫలితమే ఈ అవార్డు అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రజలకు ఏమొస్తది, రైతులకు ఏమొస్తది అని చర్చ జరిగిన నేపథ్యంలో ఈ అవార్డు సరైన సమాధానమని అన్నారు. అధికారం చేపట్టిన మూడేళ్లలో వ్యవసాయ రంగంలో అనేక నూతన పద్ధతులు తెచ్చి, రైతులకు అనేక రాయితీలు కల్పించి రాష్ట్ర రైతాంగం పట్ల దేవుడిగా మారిన కెసిఆర్ మంత్రివర్గంలో తాను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నందుకు గర్విస్తున్నానని అన్నారు. ఈసారి సాధారణ వార్షిక బడ్జెట్‌తో పాటు ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను కూడా పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. రోజుకు రెండు గంటల విద్యుత్ సరఫరా చేసే దశ నుంచి 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేసే దశకు చేరుకున్నామన్నారు. మొత్తం కోటి ఎకరాలకు సాగునీరు లభిస్తే తమకు పుట్టగతులు ఉండవని ప్రతిపక్షాలు బెంబేలెత్తిపోతున్నాయని అన్నారు. 17వేల కోట్ల రూపాయల వ్యవసాయ రుణ మాఫీ చేయడంతో పాటు విత్తనాలకు కొరత లేకుండా ముందే ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు.