తెలంగాణ

కాళేశ్వరాన్ని అడ్డుకుంటున్న కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 20: ప్రాజెక్టులను అడ్డుకోవడానికి కుట్ర పన్నుతున్న కాంగ్రెస్ పై ప్రజలే తిరగబడాలని టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పిలుపు ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ కాలుష్యంపై ప్రభుత్వం జరపతలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా వేయాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆజయ్ నారాయణ్‌కు కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి ఫిర్యాదు చేయడం అత్యంత దుర్మార్గ చర్య అని విమర్శించారు. 60 ఏళ్ల నుంచి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉన్న ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేయడానికి ప్రయత్నిస్తుంటే, ప్రాజెక్టులను అడ్డుకోవడానికి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం పర్యావరణంపై 15 ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని, అన్ని సౌకర్యాలు ఉన్న ప్రాంతాలను ఎంపిక చేస్తే, ఆక్కడ సౌకర్యంగా లేదు, హైదరాబాద్‌లో అభిప్రాయ సేకరణ ఎందుకు జరపడం లేదని కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన పోలవరం, చేవెళ్ల- ప్రాణహిత ప్రాజెక్టుల ప్రజాభిప్రాయ సేకరణ హైదరాబాద్‌లో జరిగిందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు కోటి కుట్రలు చేసినా టిఆర్‌ఎస్ ప్రభుత్వం వాటిని చేధించి ఉక్కు సంకల్పంతో ముందుకు పోయి కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చి తీరుతుందని అన్నారు.