తెలంగాణ

విక్రమ్.. యూ టర్న్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 20: మాజీ మంత్రి తనయుడు విక్రమ్‌గౌడ్ కాల్పుల ఘటనపై యూ టర్న్ తీసుకున్నారు. విక్రమ్‌గౌడ్ తనపై సుపారీ గ్యాంగ్‌చేత కాల్పులు జరిపించుకున్నాడని పోలీసులు నిర్ధారించి, అతని వాంగ్మూలం తీసుకున్న పోలీసులకు చుక్కెదురైంది. కాల్పుల ఘటనపై విక్రమ్‌గౌడ్ కొత్తవాదనలు చేశారు. విక్రమ్‌గౌడ్‌పై గత నెల 28న జరిగిన కాల్పుల ఘటన విషయం తెలిసిందే. ఈ కేసులో ఈనెల 3 నుంచి రిమాండ్‌లో ఉన్న విక్రమ్‌గౌడ్ శనివారం బెయిల్‌పై విడుదలయ్యారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, తనపై కాల్పులు జరిపిందెవరో పోలీసులే నిర్ధారించాలని అన్నారు. తనకు తెలంగాణలో వెపన్ లైసెన్స్ లేదంటూనే..ఒడిశాలో గన్ లైసెన్స్ తీసుకున్నానని చెప్పారు. ఒడిశాలో కొందరు మైనింగ్ వ్యాపారులతో గొడవలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ పోలీసులే అంటున్నారన్నారు. ‘నాపై నేనే కాల్పులు ఎలా జరుపుకుంటాను?’ అని విక్రమ్‌గౌడ్ ప్రశ్నించారు. రూ. 40 కోట్లు అప్పుల్లో ఉన్నానని కూడా పోలీసులకు తెలుసు. అలాంటిది తనపై తాను కాల్పులు జరిపించుకునేందుకు రూ. 50 లక్షలు సుపారీ ఏవిధంగా ఇస్తానో పోలీసులే చెప్పాలన్నారు. తనపై కాల్పులు జరిపిన వారెవరో పోలీసులే నిర్ధారించాలని విక్రమ్‌గౌడ్ పునరుద్ఘాటించారు. సినీ పరిశ్రమలో చాలామంది తెలుసని, అయితే డ్రగ్స్ కేసులో తనకు ఎలాంటి సంబంధాలు లేవని విక్రమ్‌గౌడ్ స్పష్టం చేశారు. రాజకీయ శక్తులే తనపై కాల్పులకు పాల్పడ్డారని ఆరోపించారు. తనకు ఎలాంటి అప్పులు లేవని.. అప్పులున్నట్టు నిరూపిస్తే.. తమ అస్తులు అమ్మి అప్పులు తీరుస్తానన్నారు. తనపై కేసును కోర్టులోనే తేల్చుకుంటానని విక్రమ్‌గౌడ్ స్పష్టం చేశారు.