తెలంగాణ

బాలానగర్‌లో భారీ ఫ్లైఓవర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 20: హైదరాబాద్‌లో బాగా రద్దీగా ఉండే బాలానగర్ ప్రాంతంలో ఫ్లైఓవర్ నిర్మించేందుకు సోమవారం శంకుస్థాపన జరుగుతోంది. బాలానగర్ క్రాస్ రోడ్డు నుండి నర్సాపూర్ క్రాస్ రోడ్డు వరకు దాదాపు 1.09 కిలోమీటర్ల పొడవుతో ఆరులేన్ల ఫ్లైఓవర్ నిర్మించేందుకు రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె. తారకరామారావు సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు శంకుస్థాపన చేస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే బాలానగర్ క్రాస్ రోడ్డులో వాహనాల రాకపోకలకు సౌలభ్యం కలుగుతుంది. బోయిన్‌పల్లి ప్రాంతం నుండి కూకట్‌పల్లి వై జంక్షన్ వైపు వెళ్లే వాహనాలు, బాలానగర్ నుండి నర్సాపూర్ క్రాస్ రోడ్డు వైపు వెళ్లే వాహనాలు బాలానగర్ క్రాస్‌రోడ్డు సిగ్నల్స్ వద్ద పీక్ అవర్స్‌లో చాలాసేపు వేచి ఉండాల్సి వస్తోంది. ప్రస్తుతం ప్రతిపాదించిన ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే రద్దీ తగ్గుతుంది. ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ.104కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ అంచనాలకు అనుగుణంగా టెండర్లు పిలవగా, రెండు కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి. బిఎస్‌సిపిఎల్ కంపెనీ 68.67 కోట్లకు (ఇంటర్నల్ బెంచ్ మార్క్-ఐబిఎం కన్నా 0.6352 శాతం తక్కువ) బిడ్ దాఖలు చేసింది. మరో కంపెనీ అయిన ఎం. వెంకట్‌రావు ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్సు ప్రైవేట్ లిమిటెడ్ 72.52 కోట్లకు (4.95 శాతం ఎక్కువ) బిడ్ దాఖలు చేసింది. దాంతో బిఎస్‌సిపిఎల్‌కు ఈ ప్రాజెక్టు పనిని అప్పచెబుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫ్లైఓవర్ కోసం అవసరమైన భూమి (దాదాపు 30 వేల చదరపు గజాలు) ని సేకరించేందుకు వీలుగా హెచ్‌ఎండిఎ (హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ) ఇటీవలే 25 కోట్ల రూపాయలను జిహెచ్‌ఎంసికి (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్) కు అందచేసింది. మిగతా డబ్బును దశలవారీగా విడుదల చేస్తామని హెచ్‌ఎండిఎ హామీ ఇచ్చింది.
ఈ మెగా ఫ్లైఓవర్ ప్రాజెక్టు నిర్మాణానికి సోమవారం కెటిఆర్ శంకుస్థాపన చేస్తారని అధికారులు ప్రకటించారు. వీలైనంత త్వరగా దీన్ని నిర్మించాలని భావిస్తున్నారు.