తెలంగాణ

లౌకికవాదానికి ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 20: దేశంలో లౌకికత్వానికి ప్రమాదం ఏర్పడిందని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 73వ జయంతిని ఆదివారం టి.పిసిసి ఘనంగా నిర్వహించింది. తొలుత సోమాజిగుడాలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి పూలదండ వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపి వి. హనుమంత రావు ఏర్పాటు చేసిన సద్భావన పరుగును కూడా ఆయన ప్రారంభించారు. సేవాదళ్ చైర్మన్ కనుకుల జనార్థన్ రెడ్డి అధ్వర్యంలో గాంధీ భవన్‌లో ఆవరణలో మొక్కలు నాటారు. ఆ తర్వాత ప్రకాశం హాలులో జాతీయ సాలిడారిటీ కమిటీ చైర్మన్ అఫ్జలుద్దీన్ అధ్వర్యంలో ఏర్పాటైన సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రసంగిస్తూ దేశ ప్రజలను విభజించి పాలించి రాజకీయ లబ్ది పొందేందుకు బిజెపి కుట్ర చేస్తున్నదని ఆయన విమర్శించారు. పసి పిల్లల ప్రాణాలు పోతున్నా, దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నా స్పందించని బిజెపి నాయకులు ఆవుల గురించి ఆందోళన చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
రాజీవ్ గాంధీ అత్యుత్తమ ప్రధానిగా గుర్తింపు పొందారని, ఆయన ఆశయాలను అనుసరించడం దేశ ప్రజలకు చాలా ముఖ్యమని అన్నారు. యువకులు రాజకీయాల్లోకి రావాలన్న ఆకాంక్షతో వారికి 18 ఏళ్ళకే ఓటు హక్కు కల్పించారని ఆయన తెలిపారు. మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు, సాంకేతిక విప్లవం, పంచాయతీలకు నేరుగా నిధులు తదితర విప్లవాత్మక చర్యలు తీసుకుని వచ్చారని ఆయన తెలిపారు. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన గాంధీ, నెహ్రూ కుటుంబాల ప్రాధాన్యతలను తగ్గించేందుకు ఈ పాలకులు ప్రయత్నిస్తున్నారని ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు.

చిత్రం..మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్న పిసిసి చీఫ్ ఉత్తమ్, విహెచ్ తదితరులు