తెలంగాణ

హైటెక్ వ్యభిచారం రట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/గచ్చిబౌలి, ఆగస్టు 20: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో హైటెక్ వ్యభిచారం గుట్టురట్టయింది. మసాజ్ ముసుగులో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న పలువురిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా మసాజ్ సెంటర్లు నడుపుతున్నారని సమాచారంతో పోలీసులు పలు మసాజ్ సెంటర్లపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో దాదాపు 40 మంది యువతీ, యువకులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మసాజ్ సెంటర్లలో సోదాలు జరిపారు. మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గంలోని పలు మసాజ్ సెంటర్లలో తనిఖీలు చేసి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న న్యూ రెవీవ్ స్పా అండ్ బ్యూటీ కేర్, మిసెస్ తంత్రా స్పా, మోహ్ స్పా మజాజ్ సెంటర్లను గుర్తించారు. ఈ తనిఖీల్లో దాదాపు 40 మంది యువతీ, యువకులను అదుపులో తీసుకున్నట్టు మాదాపూర్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ కళింగరావు తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పట్టుబడిన యువతుల్లో 14 మంది థాయ్‌లాండ్‌కు చెందిన వారు. కాగా, మరికొందరు నార్త్ ఇండియాకు చెందిన వారని సిఐ తెలిపారు. థాయ్‌లాండ్ యువతులను విజిటింగ్ వీసాపై తీసుకువచ్చి మసాజ్ సెంటర్లలో వ్యభిచారం నిర్వహిస్తున్నారని ఆయన వెల్లడించారు. ఈ దందాలో తొమ్మిది మంది నిర్వాహకులను అరెస్టు చేసినట్టు ఆయన వెల్లడించారు.

చిత్రం..మసాజ్ సెంటర్లలో పోలీసులకు చిక్కిన యువతులు