తెలంగాణ

వ్యవసాయ మండలా? భజన మండలా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 20: భారత వ్యవసాయ మండలి తెలంగాణ సిఎం కెసిఆర్‌కు వ్యవసాయ పురస్కారాన్ని ప్రకటించడం సిగ్గు చేటని తెలంగాణ తెలుగుదేశం పార్టీ (టిటిడిపి) విమర్శించింది. వ్యవసాయ మండలా..? లేక కెసిఆర్ భజన మండలా..? అని ప్రశ్నించింది. టిటిడిపి అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలోనే రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రాష్ట్రం 2వ స్థానంలో ఉందని, కేంద్రం కరువు సాయంగా రూ.710 కోట్లు కేటాయిస్తే రైతుల కోసం ఖర్చు చేయకుండా దారిమళ్లించారని, రూ.17 వేల కోట్ల రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పి అది పూర్తి చేయకపోవడంతో ఇంకా రైతుల పాస్‌బుక్‌లు బ్యాంకులు వద్దే ఉన్నాయని అన్నారు. రైతులు నకిలీ విత్తనాలతో అల్లాడిపోతుండగా, మరోవైపు గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చేస్తే లాఠీ చార్జి చేశారని గుర్తు చేశారు. తెలంగాణలో రైతులు, వ్యవసాయం పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే వ్యవసాయ మండలి కెసిఆర్‌కు ఎలా పురస్కారం ప్రకటించిందని అడిగారు. కెసిఆర్ అధికారంలోకి వచ్చాక సాగు విస్తీర్ణం తగ్గిందని గణాంకాలే చెబుతుంటే సాగులో అద్భుత ఫలితాలు వచ్చాయని మండలి ఎలా ప్రకటించిందో అర్థం కావడం లేదని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ మండలి అధికారులు రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులు తెలుసుకుంటే మంచిదని అన్నారు.